విశాఖపట్నం📅 తేదీ: అక్టోబర్ 08, 2025 ప్రజలే తుది నిర్ణేతలు..అవగాహన కల్పించాల్సిన బాధ్యత కంపెనీపై ఉందని పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు స్పష్టంచేశారు
ప్రజాభిప్రాయం తుది నిర్ణయం అని, ప్రజలు తమ భవిష్యత్తును నిర్ణయించే అంశాలపై తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచడం వారి ప్రజాస్వామ్య హక్కు అని.ఇలాంటి ప్రజావినికిడి సమావేశాలకు ముందు కంపెనీ నిర్వాహకులు ప్రజల్లో సరైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందని ఆయన పేర్కొన్నారు.
ప్రాజెక్టు లాభనష్టాలు, పర్యావరణ ప్రభావం వంటి అంశాలపై ప్రజలకు పూర్తి సమాచారం అందించాలని సూచించారు.
అలాగే కొందరు స్వప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదారి పట్టించే వర్గాల వలలో పడకూడదని ప్రజలను అప్రమత్తం చేశారు.
