ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీశాయి. జనసేన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో నాదెండ్ల మనోహర్ సమక్షంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జగన్ అరెస్టుపై అమిత్ షాను కోరితే చందరబాబు తాత్కాలిక మిత్రుడు జగన్ ధిర్ఘకాలిక మిత్రుడన్నారని ఒక టీవి ఛానల్ లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి మధ్య సంబంధాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు నిజమా కాదా అన్నది పక్కన పెడితే, గత రాజకీయ పరిణామాలను గుర్తు చేసేలా నాగేశ్వరరావు చేసిన విశ్లేషణ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
గతంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ పొత్తులో ఉన్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీపై చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు చేసిన ఘాటు విమర్శలు, “ధర్మ పోరాట దీక్షలు” వంటి కార్యక్రమాలను భాజపా ఎలా ఆలోచించింది.
అదే సమయంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై అనేక కేసులు ఉన్నప్పటికీ వాటి విషయంలో బీజేపీ వ్యవహరించిన తీరు కూడా నాగేశ్వరరావు విశ్లేషణ రాజకీయ దుమారానికి కారణమైందని ప్రచారం జరుగుతోంది.రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనే సామెతకు తగ్గట్టుగానే ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను నాగేశ్వరరావు వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఈ వ్యాఖ్యలు వెలుగులోకి రావడంతో జనసేన, టీడీపీ పార్టీల శ్రేణుల్లో కొంత అసంతృప్తి, ఆశ్చర్యం వ్యక్తమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
అయితే వివాదం ముదరడంతో ఇటీవల తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు నాగేశ్వరరావు మీడియా ద్వారా స్పష్టం చేసినట్లు సమాచారం. అయినప్పటికీ ఆయన చేసిన వ్యాఖ్యల ప్రభావం మాత్రం రాజకీయ వర్గాల్లో ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఈ పరిణామాలు భవిష్యత్తులో ఏపీ రాజకీయ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా జనసేన-టీడీపీ-బీజేపీ సంబంధాలపై ముందుముందు మరిన్ని రాజకీయ చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
