నవంబర్ 5:విజయనగరం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి పి.ఎం. యశస్వి ఉపకారవేతనాలు కోసం దరఖాస్తుల ఆహ్వానం జారీచేయబడింది.
జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు సాధికారత అధికారి శ్రీమతి జె. జ్యోతిశ్రీ గారు తెలియజేసిన ప్రకారం, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల లోపు ఉన్న బి.సి., ఈ.బి.సి. మరియు సంచారజాతుల విద్యార్థులు, ప్రస్తుతం 9వ తరగతి లేదా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (11వ తరగతి) చదువుతున్నవారు, ఈ పథకానికి అర్హులు.
విద్యార్థులు నవంబర్ 15వ తేదీ లోపు https://yet.nta.ac.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించే ప్రతిభాపరీక్ష ఆధారంగా జరుగుతుంది.
ఎంపికైన విద్యార్థులకు 9వ–10వ తరగతుల వారికి సంవత్సరానికి రూ.75,000/-, అలాగే 11వ–12వ తరగతుల వారికి సంవత్సరానికి రూ.1,25,000/- ఉపకారవేతనంగా మంజూరు చేయబడుతుంది.
మరిన్ని వివరాలకు https://yet.nta.ac.in లేదా https://socialjustice.gov.in/schemes/ వెబ్‌సైట్లను సందర్శించవచ్చు.
అదనంగా, విద్యార్థులు కార్యాలయ పనిదినాల్లో జిల్లా వె.త. సంక్షేమ మరియు సాధికారత అధికారి లేదా సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారులుని సంప్రదించవచ్చు.సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:విజయనగరం: 📞 7893002013గజపతినగరం: 📞 9395397192బొబ్బిలి: 📞 8897291863
