విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా మాత్రమే కాకుండా, ఇప్పుడు భారత్ తూర్పు తీరంలో డేటా సెంటర్ల హబ్ గా మారబోతుంది.
గూగుల్, Sify వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు భారీ పెట్టుబడులు ప్రకటించడంతో, ఈ నగరం భవిష్యత్తులో “AI City Vizag”గా మారే దిశగా అడుగులు వేస్తోంది.—భారీ పెట్టుబడులు — బిలియన్ డాలర్ల ప్రాజెక్టులుసమాచార ప్రకటనల ప్రకారం, గూగుల్ విశాఖపట్నంలో సుమారు $10 బిలియన్ పెట్టుబడితో 1 గిగావాట్ (GW) డేటా సెంటర్ క్లస్టర్ను స్థాపించబోతోంది.
ఈ ప్రాజెక్ట్ ద్వారా 1.88 లక్షల వరకు ఉద్యోగాలు (ప్రత్యక్ష, పరోక్ష) ఏర్పడే అవకాశముందని అంచనా.ఇదే సమయంలో, Sify Technologies కూడా AI ఆధారిత డేటా సెంటర్ ప్రాజెక్ట్‌ను ఇక్కడే ప్రారంభించడానికి సిద్ధమవుతోంది.ఈ పెట్టుబడులు విశాఖపట్నానికి కొత్త టెక్ హబ్ ఇమేజ్ తెస్తాయని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.
డేటా సెంటర్ అంటే ఏమిటి?
డేటా సెంటర్ అనేది ఆన్‌లైన్ ప్రపంచానికి గుండె.ఇక్కడ వేల సంఖ్యలో సర్వర్లు, నిల్వ వ్యవస్థలు, నెట్‌వర్క్ పరికరాలు 24 గంటలూ పనిచేస్తూ,క్లౌడ్ సేవలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీడియో స్ట్రీమింగ్, బ్యాంకింగ్ వంటి సేవలకు మద్దతు ఇస్తాయి.
ఇవి ఏర్పాటు చేయాలంటే అధిక విద్యుత్ సరఫరా, బలమైన నెట్‌వర్క్ కనెక్టివిటీ, స్థిరమైన మౌలిక సదుపాయాలు అవసరం ఈ మూడు అంశాలు విశాఖలో ఇప్పటికే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.
ఉపాధి అవకాశాలు:
యువతకు కొత్త దారులుడేటా సెంటర్ నిర్మాణం, నిర్వహణ, ఆపరేషన్ దశల్లో అనేక రకాల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. నిర్మాణ దశలో సివిల్, ఎలక్ట్రికల్, HVAC టెక్నీషియన్లు, సెక్యూరిటీ సిబ్బంది,ఆపరేషన్ దశలో నెట్‌వర్క్ ఇంజినీర్లు, సిస్టమ్ అడ్మిన్స్, డేటా అనలిస్టులు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు,సహాయక రంగాల్లో తదితర ఉపాధి అవకాశాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.
నిపుణులు చెపుతున్న ప్రకారం డేటా సెంటర్ నిర్మాణం పూర్తయ్యాక ఉద్యోగాల సంఖ్య కొద్దిగా తగ్గుతుంది. కానీ, కొత్త నైపుణ్యాలు నేర్చుకున్నవారికి ఐటి రంగంలో పెద్ద అవకాశాలు ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ పెట్టుబడులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలోపేతం అవకాశం ఉంటుంది. వివిధ టాక్స్ లు రూపంలో ఆస్తి పన్ను, విద్యుత్ పన్నులు, లైసెన్స్ ఫీజులు ద్వారా ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
పరిశ్రమ వృద్ధి వల్ల రాష్ట్ర GSDPలో ₹10,500 కోట్ల వరకు వృద్ధి సాధ్యమని అంచనాలున్నాయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగుదలకు దోహదం చేస్తుంది విద్యుత్, రహదారులు, ఫైబర్ నెట్‌వర్క్‌లు మెరుగుపడి, ఇతర రంగాలకు కూడా ఉపయోగపడతాయి.
కొత్త పెట్టుబడుల ఆకర్షణ ఊతమిస్తుంది..ఒకసారి గూగుల్, Sify లాంటి కంపెనీలు అడుగుపెట్టిన తర్వాత, ఇతర టెక్ సంస్థలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశం పెరుగుతుంది.
నెట్‌వర్క్, విద్యుత్, శీతలీకరణ రంగాల్లో ఉద్యోగాలు పెరుగుతాయి.శిక్షణ అవకాశాలు: కంపెనీలు స్థానిక విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, స్కిల్ ట్రైనింగ్‌లు అందించవచ్చు.జీవన ప్రమాణం: రోడ్లు, విద్యుత్, కనెక్టివిటీ మెరుగవడం వల్ల ప్రజల జీవన ప్రమాణం మెరుగవుతుంది.
ఆర్థిక ప్రగతిలో అవకాశాలు: హోటళ్లు, రెస్టారెంట్లు, రియల్ ఎస్టేట్, ట్రాన్స్‌పోర్ట్ రంగాలకు అవకాశాలు పెరుగుతాయి.
సవాళ్లు కూడా ఉన్నాయ్:
ఏ అభివృద్ధికైనా సవాళ్లు ఉంటాయి , ఈ రంగంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఎనర్జీ వినియోగం:
డేటా సెంటర్లు భారీ విద్యుత్ వినియోగం చేస్తాయి, శీతలీకరణ కోసం నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది., శబ్దం, వాయు కాలుష్యం సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, నిపుణుల సలహాలమేరకు ఈ ప్రాజెక్టులను పర్యావరణ సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలిని సూచనలు చేస్తున్నారు.
విశాఖపట్నం ఇప్పటికే “Fintech Valley”, “Millennium IT Towers”, “MedTech Zone” వంటి ప్రాజెక్టులతో టెక్ రంగంలో గుర్తింపు పొందింది.ఇప్పుడు గూగుల్, Sify వంటి సంస్థలు ఇక్కడ అడుగుపెట్టడంతో, ఈ నగరం భారత్ తూర్పు తీరంలో “డేటా సెంటర్ క్లస్టర్ హబ్”గా ఎదగబోతోంది.
స్ధానిక యువతకు రాబోయే అవకాశాలను అందిపుచ్చుకునే యువతకు నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలి, డేటా సెంటర్ ఆపరేషన్స్, సైబర్ సెక్యూరిటీ, నెట్‌వర్కింగ్ వంటి కోర్సులు ఏర్పాటు చేయాలి.
పర్యావరణ నియంత్రణ అవసరం:
విద్యుత్, నీటి వినియోగంపై కఠిన నియంత్రణలు ఉండాలి.ప్రజా భాగస్వామ్యం: కంపెనీలు స్కూల్స్, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావాలి.
స్టార్టప్ ప్రోత్సాహం: స్థానిక యువతకు టెక్ స్టార్టప్‌లు ప్రారంభించేందుకు సదుపాయాలు కల్పించాలి.
పోర్ట్ సిటీగా ప్రసిద్ధి పొందిన విశాఖపట్నం ఇప్పుడు క్లౌడ్ సిటీగా రూపాంతరం చెందుతోంది.గూగుల్, Sify ప్రాజెక్టులు కేవలం పెట్టుబడులు మాత్రమే కాదు ఇవి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును టెక్ హబ్ దిశగా నడిపే మార్గదర్శకాలు.విద్య, నైపుణ్యం, పర్యావరణ సమతుల్యం కలిస్తే, విశాఖపట్నం త్వరలోనే భారతదేశంలో ముంబై తరహా ఆర్థిక రాజధాని గా నిలుస్తుందని మేధావులు అంచనా వేస్తున్నారు.
