విజయనగరం, అక్టోబర్ 21: దేశం, రాష్ట్ర, జిల్లా ప్రజల రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరులకు హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నట్లు విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి తెలిపారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవంను జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలోగల ‘స్మృతి వనం’లో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, పోలీస్ విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు సిబ్బంది త్యాగం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రజల భద్రత, శాంతి స్థాపన, నేర నియంత్రణలో పోలీసు శాఖ పోషిస్తున్న పాత్ర అత్యంత ముఖ్యమని ఆయన తెలిపారు. పోలీస్ శాఖ నిబద్ధత, క్రమశిక్షణ, ధైర్యసాహసానికి చిహ్నమని కలెక్టర్ అభివర్ణించారు. సమాజంలో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ప్రతి పౌరుడు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టరు రామసుందర్ రెడ్డి, జిల్లా ప్రధాన న్యాయ మూర్తి ఎం.బబిత, జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్లు ముఖ్య అథిదులుగా హాజరై, అమరవీరుల స్మృతి స్థూపం వద్ద పోలీసు అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.

దేశ అంతర్గత భద్రతకు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు— ఎస్పీ ఎ.ఆర్.దామోదర్
జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ – దేశంలో మావోయిజం తీవ్రంగా ఉన్న సమయంలో దేశ అంతర్గత భద్రత కోసం, మావోయిస్టుల తీవ్రవాద కార్యక్రమాలను అరికట్టేందుకు వారితో పోరాటం చేసి, ఎంతోమంది పోలీసు అధికారులు, సిబ్బంది తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారన్నారు. వివిధ విభాగాల్లో పని చేస్తున్న పోలీసులు, పారా మిలటరీ దళాలు శాంతిభద్రత పరిరక్షణలో భాగంగా మావోయిస్టులు, తీవ్రవాదులు, సంఘవిద్రోహ శక్తులతో
వీరోచిత పోరాటం చేసిన కారణంగా తీవ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టి, నేడు మనమందరం స్వేచ్ఛగా, శాంతియుతంగా జీవించే అవకాశం కల్పించారన్నారు. ఈ పోరాటంలో ప్రాణాలను కోల్పోయిన పోలీసు కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని, వారి కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు.
దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో ఈ సంవత్సరం అమరులైన 191 మంది పోలీసుల వివరాలతో కూడిన పుస్తకాన్ని జిల్లా ఎస్పీ ఆవిష్కరించగా, విధులు నిర్వహిస్తూ, తీవ్రవాదుల దాడుల్లో
మృతి చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది పేర్లును అదనపు ఎస్పీ పి.సౌమ్యలత చదివి వినిపించారు.
ఉమ్మడి విజయనగరం జిల్లా లో ఎంతో ధైర్య, సాహసాలతో మావోయిస్టుల చర్యలను ఎదుర్కొంటూ విధులు నిర్వహించి మావోయిస్టుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయి అమరులైన ముద్ధాడ గాంధీ, చిట్టిపంతులు చిరంజీవి, షేక్ ఇస్మాయిల్, బి.శ్రీరాములు,ఎస్.సూర్యనారాయణ త్యాగాలను, అమరులైన పోలీసులను స్మరించుకొంటూ, అమర వీరుల స్మృతి స్థూపం వద్ద జిల్లా కలెక్టరు రామసుందర్ రెడ్డి, జిల్లా ప్రధాన న్యాయ మూర్తి ఎం.బబిత, జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఫస్ట్ అదనపు డ్రిస్టిక్ట్ న్యాయమూర్తి మీనాదేవి, పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి కే.నాగమణి, కోరుకొండ సైనిక్ స్కూలు ప్రిన్సిపాల్ కెప్టెన్ ఎస్.ఎస్.శర్మ, స్థానిక ఎమ్మేల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, ప్రజా ప్రతినిధులు పాలవలస యశస్వి, అదనపు ఎస్పీ సౌమ్యలత, ఎఆర్ అదనపు ఎస్పీ జి. నాగేశ్వరరావు, విధి నిర్వహణలో అమరులైన ముద్ధాడ గాంధీ, చిట్టిపంతుల చిరంజీవిరావు, షేక్ ఇస్మాయిల్ కుటుంబ సభ్యులు, పలువురు డిఎస్పీలు, సిఐలు, ఆర్ఐలు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని పోలీసు అమర వీరుల స్థూపం వద్ద పుష్పాలను సమర్పించి, ఘనంగా నివాళులు అర్పించారు. రిజర్వు ఇన్స్పెక్టరు ఎన్. గోపాల నాయుడు ఆధ్వర్యంలో పోలీసులు పరేడ్ నిర్వహించగా, పోలీసుల తుపాకుల విన్యాసంతో అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని, విధి నిర్వహణలో అమరులైన పోలీసులను స్మరిస్తూ, రెండు నిమషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా చెళ్లపిళ్ల సుజాత వ్యవహరించారు.

పోలీసు అమరవీరుల కుటుంబాలతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత, జిల్లా కలెక్టరు రామ సుందర్ రెడ్డి, ఎమ్మేల్యే అధితి విజయలక్ష్మి, జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మరియు ఇతర పోలీసు అధికారులు మమేకమై, వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకొని, వారికి పండ్లు, నగదును అందజేసి, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్న భరోసాను కల్పించారు. జిల్లా పోలీసు కార్యాలయం నుండి కలెక్టరు ఆఫీసు జంక్షన్ వరకు జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్
ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది పోలీసు అమరవీరుల సేవలను కీర్తిస్తూ, ర్యాలీ, మానవ హారం నిర్వహించి, నినాదాలు చేసారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు రామసుందర్ రెడ్డి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.ఐబిత, జిల్లా ఎస్పీ
ఎ.ఆర్.దామోదర్, ఫస్ట్ అదనపు డిస్ట్రిక్ట్ న్యాయమూర్తి మీనాదేవి, పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కే.నాగమణి, సైనిక స్కూలు ప్రిన్సిపాల్ కెప్టెన్ ఎస్.ఎస్.శాస్త్రి, స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు, అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, విజయనగరం డిఎస్పీ ఇన్చార్జ్ డిఎస్పీ
ఆర్.గోవిందరావు, చీపురుపల్లి డిఎస్పీ రాఘవులు, డిటిసి డిఎస్పీ ఎం.వీరకుమార్, ఎఆర్ డిఎస్పీ ఈ.కోటి రెడ్డి, ఎ.ఓ.శ్రీనివాసరావు, పలువురు సీఐలు, ఆర్ఐలు, డిపిఒ పర్యవేక్షకులు టి.రామకృష్ణ, వెంకటలక్ష్మి, పోలీసు అసోసియేషను
రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.శ్రీనివాసరావు, పోలీసు అమర వీరుల కుటుంబ సభ్యులు, పలువురు ఎస్ఐలు, ఆర్ఎస్ఎస్ఐలు,
ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని పోలీసు అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.
