Posted in

విశాఖ జిల్లాకు 7 రాష్ట్రస్థాయి, 44 జిల్లాస్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు

Vishakapatnam district collector M.N. Harendhira Prasad,
Vishakapatnam district collector M.N. Harendhira Prasad,

విశాఖపట్నం, అక్టోబర్ 2:రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో విశాఖ జిల్లా ఘన విజయం సాధించింది.

రాష్ట్ర స్థాయిలో ప్రకటించిన 42 అవార్డుల్లో 7 అవార్డులు, జిల్లా స్థాయిలో 44 అవార్డులు విశాఖ జిల్లాకు లభించాయి.జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ గురువారం కలెక్టరేట్‌లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.

జీవీఎంసీకి స్వచ్ఛ సర్వేక్షన్, సింహగిరి కాలనీ మహిళా సమాఖ్యకు స్వచ్ఛ SLFS, పెందుర్తి గోరపల్లికి స్వచ్ఛ గ్రామ సమాఖ్య, నడుపూరు ZPHS‌కు స్వచ్ఛ పాఠశాల, MVP రైతు బజార్‌కు స్వచ్ఛ రైతు బజార్, లోటస్ వైర్లెస్ టెక్నాలజీకి స్వచ్ఛ MSME, తిరుమల నగర్ రెసిడెన్షియల్ కాలనీకి స్వచ్ఛ కాలనీ అవార్డులు లభించాయి.

జిల్లా స్థాయిలో పెదపాలెం, నగరపాలెం, తాటితూరు, గంభీరం, వేముల వలస స్వచ్ఛ గ్రామ పంచాయతీలుగా ఎంపికయ్యాయి. ద్వారకా బస్ స్టేషన్, గాజువాక–కణితి PHCలు, DRDA, ZP ఆఫీసు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తదితర సంస్థలు పలు విభాగాల్లో పురస్కారాలు అందుకున్నాయి.

అలాగే శానిటేషన్ వర్కర్లు ఆర్.అప్పల పైడియ్య, వి.అరుణ కుమారి, నూకల లక్ష్మీ, డి.పైడి రాజు, వై.దేవుడు ఉత్తమ శ్రామికులుగా, ఎస్.చిన్న, వి.సత్యనారాయణ, సి.సూర్యనారాయణ, బి.మరిడయ్య, పి.రాంబాబు గ్రీన్ అంబాసిడర్లుగా గుర్తింపు పొందారు.

అక్టోబర్ 6న ఇన్‌చార్జి మంత్రివర్యుల చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా అభివృద్ధి, స్వచ్ఛతలో ప్రజల సహకారం మరింత పెరగాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *