పేద మధ్యతరగతి వర్గాలకు వ్యవసాయ, విద్య, వ్యాపార రంగానికి సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా డాక్టర్ వి.ఎస్. కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ విజయ్ బాబు ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ….సూపర్ సేవింగ్స్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ విద్యారంగానికి విద్యార్థులకు సూపర్ గిఫ్ట్ ఇచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
అదేవిధంగా జీఎస్టీ సంస్కరణలో యువత జీవితాల్లో వెలుగులు నింపే విధంగా తీసుకొచ్చిన ఈ మార్పుని ప్రతి ఒక్కరూ తెలుసుకునే విధంగా అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిఎస్టి అసిస్టెంట్ కమిషనర్, జిఎస్టి డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ మరియు అధికారులు, విద్యార్థులు పాల్గొనడం జరిగింది. భవదీయ తిప్పనబోయిన కోటేశ్వరరావు జిల్లా మీడియా ఇంచార్జ్ భారతీయ జనతా పార్టీ.
