విజయనగరం 11 అక్టోబర్ 2025 :
ఆపదలో ఉన్న బాధితులను అదుకోవడంలో తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని రాష్ట్ర ఎంఎస్ఎమ్ఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సీఎం సహాయ నిధి నుండి మంజూరైన ఆర్థిక సహాయానికి సంబంధించిన రూ. 6,78,673 ల విలువైన 11 చెక్కులను లబ్ధిదారులకు శనివారం మంత్రి శ్రీనివాస్ అందజేశారు.

దాత్తిరాజేరు మండలం పెదమానాపురం గ్రామానికి చెందిన గంటా రవికుమార్ నాయుడుకు రూ. 1,05,547 దాత్తిరాజేరు మండలం తాడెందొరవలస గ్రామానికి చెందిన పూడి సత్యనారాయణ రూ. 56, 309 దత్తిరాజేరు మండలం చిన్నకాద గ్రామానికి చెందిన ధూళి అప్పన్న రూ. 30,000దాత్తిరాజేరు మండలం పెదమానాపురం గ్రామానికి చెందిన పతికాయల సూరమ్మ రూ. 60,000 దత్తిరాజేరు మండలం మరడాం గ్రామానికి చెందిన కుప్పా శ్రీనివాసరావు రూ. 86,308 దత్తిరాజేరు మండలం ఇంగిలాపల్లి గ్రామానికి చెందిన గాడి అప్పలనాయుడు రూ. 50,227
గజపతినగరం మండలం కెంగువ గ్రామానికి చెందిన మండల రాములమ్మ రూ. 66,883 గంట్యాడ మండల కేంద్రంలో చెందిన మందపాటి రామచంద్రరాజుకు రూ. 40,000 జామి మండలం సోమయాజులపాలెం గ్రామానికి చెందిన రాయవరపు అప్పారావు రూ. 40,000 పూసపాటిరేగ మండలం బిజిపేట, కొండాడ గ్రామానికి చెందిన గుర్రాల గరగమ్మ రూ. 36,365 జామి మండలం అన్నంరాజుపేట గ్రామానికి చెందిన అమిరపు అజయ్ రూ. 1,06,984వీరందరూ అనారోగ్య సమస్యతో వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందివున్నారు.
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సిఫార్సుతో ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా వీరికి రూ. 6,78,673 ఆర్థిక సాయం మంజూరు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జారీచేసిన 11 చెక్కులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా లబ్ధిదారులకు గజపతినగరం మంత్రి క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
