విజయనగరం అక్టోబర్ 7: జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నందు డేటా ఎంట్రీ ఆపరేటర్ (10 పోస్టులు) భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయని సర్వజన ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ ఏ పద్మజ తెలిపారు. ఈనెల 13వ తేదీ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2.00 వరకు జి జి హెచ్ కాన్ఫరెన్స్ హాల్లో అర్హత ఆసక్తిగల అభ్యర్థులు హాజరు కావాలన్నారు.గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ మరియు పీజీడీసీఏ (PGDCA) చేసినవారు అర్హులని తెలిపారుడిగ్రీ (75%) + PGDCA (25%) మార్కుల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. విజయనగరం జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు:https://vizianagaram.ap.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించాలని తెలిపారు.
Vizianagaram:డేటా ఎంట్రీ ఆపరేటర్ (10 పోస్టులు) భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు

sramasanyasidemudu@gmail.com