Posted in

దీపావళి, వెలుగులు పంచుకుందాం — కాలుష్యం కాదు..

Divali festival
Divali festival

దీపావళి టపాసులు: వెలుగుల వెనుక పొగ – ఆరోగ్యానికి ముప్పుప్రత్యేక కథనం – :

వెలుగుల పండుగగా పిలిచే దీపావళి ఆనందం ఇప్పుడు ఆరోగ్య సమస్యలకి ఆందోళనగా మారుతోంది. ప్రతి సంవత్సరం ఈ పండుగ సందర్భంగా టపాసులు కాల్చడం వల్ల నగరాల్లో వాయు కాలుష్యం. తీవ్రంగా పెరుగుతుంది

వైద్యులు, పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు — టపాసులు ఆనందం క్షణికం, కానీ వాటి వల్ల కలిగే కాలుష్య ప్రభావం రోజులు, వారాలు కొనసాగుతుందని.గాలి నాణ్యతలో తీవ్రంగా తగ్గుతుంది.

పర్యావరణ పరిశీలన కేంద్రాల వివరాల ప్రకారం..

దీపావళి రోజున రాత్రి నుంచి మరుసటి ఉదయం వరకు వాయు కాలుష్యం స్థాయి 10 రెట్లు పెరుగుతోంది. పటాకుల్లోని సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్, కార్బన్ మోనోఆక్సైడ్ వంటి రసాయనాలు వాతావరణంలో కలిశాక ‘స్మాగ్’ రూపంలో నగరాలను కప్పేస్తాయి. ఈ పొగ గాలిలో తేమతో కలిసిపడి ఊపిరితిత్తుల్లోకి చొరబడుతుంది.

పిల్లల్లో శ్వాస సమస్యలు పెరుగుతున్నాయి..

దీపావళి తరువాత పిల్లల్లో దగ్గు, ఊపిరితిత్తుల దప్పిక, కంటి మంట వంటి సమస్యలతో ఆస్పత్రులను సంప్రదించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.పిల్లల శరీరం ఇంకా ఎదుగుదల దశలో ఉండడం వల్ల వాతావరణ కాలుష్య ప్రభావం వారికి ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

“పటాకుల ధూళి కణాలు PM2.5 స్థాయిలో ఉంటాయి, ఇవి ఊపిరితిత్తుల లోతులోకి చొరబడి ఆస్తమా, అలర్జీలు కలిగిస్తాయి,” అని బాలవైద్య నిపుణులు చెబుతున్నారు.

పెద్దలకు కూడా ప్రమాదం తక్కువేమీ కాదుఆస్తమా, హృదయ రోగులు, వృద్ధులకు దీపావళి పొగ తీవ్రమైన ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు.వైద్యుల ప్రకారం, కాలుష్య గాలిలో ఉన్న రసాయనాలు రక్తనాళాలను కుంచించేస్తాయి, గుండెపై ఒత్తిడి పెంచుతాయి. “గాలి శుభ్రంగా లేని ప్రాంతాల్లో బయటకు వెళ్లడం తగ్గించాలి,” అని కార్డియాలజిస్టులు సూచిస్తున్నారు.

ప్రభుత్వ నియంత్రణలు – అమలు సడలింపు?

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే పటాకులు కాల్చాలి. అలాగే “గ్రీన్ క్రాకర్స్” మాత్రమే వాడాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) నిబంధనలు విధించింది. అయితే నగరాల్లో ఈ నియమాలు పెద్దగా పాటించబడడం లేదని పర్యావరణ కార్యకర్తలు చెబుతున్నారు.“గ్రీన్ క్రాకర్స్” సాధారణ పటాకుల కంటే 30–40% తక్కువ కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

వైద్యుల సూచనలు–

టపాసులు కాల్చేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి.- పొగ దట్టంగా ఉన్న ప్రాంతాల్లో పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లకూడదు.- శ్వాస ఇబ్బందులు, కంటి మంట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.- ఆస్తమా రోగులు ముందుగానే ఇన్‌హేలర్ వాడకంపై డాక్టర్ సలహా తీసుకోవాలి.

పర్యావరణహిత దీపావళి పండుగ జరుకొనేందుకు ప్రజా చైతన్యం ఎంతైనా అవసరం , టపాసులు లేకుండా కూడా దీపావళి జరుపుకోవచ్చని పర్యావరణ కార్యకర్తలు చెబుతున్నారు. మట్టి దీపాలు వెలిగించడం, పూలతో ఇళ్లు అలంకరించడం, సేంద్రియ పూజా సామగ్రి వాడడం వంటి మార్పులు స్వచ్ఛమైన పండుగకు మరో మార్గమని అందరూ భావించాలి.

టపాసులు క్షణిక ఆనందాన్ని ఇస్తాయి కానీ దీర్ఘకాలిక నష్టాన్ని మిగులుస్తాయి. వెలుగుల పండుగను నిజంగా వెలుగుగా ఉంచాలంటే పర్యావరణహిత మార్గాన్ని ఎంచుకోవాల్సిందేనని ఆలోచించాలి..🔥 దీపావళి, వెలుగులు పంచుకుందాం — కాలుష్యం కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *