ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జి.ప్రశాంత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యం లో ఓవర్సీస్ మాన్ పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు ఐఈఎస్ సంస్థ ల సహకారం తో జర్మన్ దేశంలో ఉద్యోగo చేయడానికి ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేసి 2 సంవత్సరాల అనుభవం ఉన్న వారి దగ్గర నుంచి దరఖాస్తులు కోరుచున్నాం.
దరఖాస్తు చేసుకున్నవారికి తేది 30.10.2025 గురువారం నాడు GOVT ITI కాలేజీ, విజయనగరo నందు జాబ్ మేళా ఏర్పాటు చేయటం జరిగింది అని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జి.ప్రశాంత్ కుమార్ మరియు ఐటీఐ కాలేజీ ప్రిన్సిపాల్ టీ.వీ. గిరి గారు ప్రకటన ఇవ్వటం జరిగింది.
అర్హత: ఐటీఐ/డిప్లొమ
ఎలక్ట్రీషియన్.
వయస్సు :18 నుంచి 30 సంవత్సరాల వరకు
Experience:
2 సంవత్సరాలు అనుభవం
ఎంపికైన వారికి నెలకు రూ.2,60,000 వరకు వేతనం, టాక్స్ ఫ్రీ వేతనంతో పాటు ఉచిత వసతి, వైద్యం, రవాణా సదుపాయం కల్పించబడుతుందని తెలిపారు.
ఆసక్తి గల అభ్యర్థులు తమ పాస్పోర్ట్, విద్యా ధృవపత్రాలు, అనుభవ పత్రాలతో కలసిhttps://naipunyam/వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం 94929 27844, 99663 36206, 83095 61123, 99888 53335 నంబర్లను సంప్రదించవచ్చు.జి.ప్రశాంత్ కుమార్జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి మరియు T V గిరి, ప్రిన్సిపాల్ GOVT ITI కాలేజీ విజయనగరం.
విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు- జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జి.ప్రశాంత్ కుమార్
