Posted in

ప్రభుత్వ ఐటీఐల్లో 16 కాంట్రాక్టు ఉద్యోగాలు.. సెప్టెంబర్ 28 వరకు దరఖాస్తులు

Jobs
Jobs

విశాఖపట్నం, సెప్టెంబర్ 7: స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి మరియు శిక్షణ శాఖ పరిధిలోని ప్రభుత్వ ఐటీఐల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న ‘ఇండియా ఏఐ డేటా అండ్ ఏఐ ల్యాబ్స్’ కోసం ఒక సంవత్సరం కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రాంతీయ ఉపసంచాలకులు ఎస్. సోలమన్ తెలిపారు.

ఎక్కడెక్కడ ఖాళీలు?

ఈ నియామకాలు కింది ప్రభుత్వ ఐటీఐల్లో చేపట్టనున్నారు.- ప్రభుత్వ ఐటీఐ, స్టీల్‌ప్లాంట్, విశాఖపట్నం- ప్రభుత్వ బాలికల ఐటీఐ, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విశాఖపట్నం- ప్రభుత్వ బాలికల ఐటీఐ, విజయనగరం- ప్రభుత్వ డీఎల్‌టీసీ/ఐటీఐ, శ్రీకాకుళం

పోస్టులు.. ఖాళీల సంఖ్య

పోస్టు| ఖాళీలుట్రైనర్ – డేటా అనలిస్ట్ అసిస్టెంట్| 4ట్రైనర్ – డేటా క్యూరేటర్ అసిస్టెంట్| 4కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్| 8మొత్తం| 16డేటా అనలిస్ట్ ట్రైనర్ అర్హతలుబీటెక్ (CSE/IT/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/అలైడ్ బ్రాంచులు), MCA, BCA లేదా ‘A’ Level (IT) అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత పరిశ్రమలో కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.డేటా క్యూరేటర్ ట్రైనర్ అర్హతలుబీటెక్ (CSE/IT/అలైడ్ బ్రాంచులు), MCA, BCA, MSc (IT/CS) లేదా NIELIT ‘A’ Level IT అర్హత కలిగిన వారు అర్హులు. సంబంధిత పరిశ్రమలో ఒక సంవత్సరం అనుభవంతో పాటు, ఒక సంవత్సరం సంబంధిత టీచింగ్ అనుభవం ఉండాలి.కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ అర్హతలుగుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి MCA, MSc (IT/CS), BCA లేదా ‘A’ Level (IT) అర్హతతో పాటు ఒక సంవత్సరం సంబంధిత అనుభవం ఉండాలి.అలాగే బీటెక్ (CSE/IT/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/అలైడ్ బ్రాంచులు) పూర్తి చేసి, ఒక సంవత్సరం సంబంధిత అనుభవం ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

నెలవారీ వేతనం-

ట్రైనర్ పోస్టులకు: నెలకు రూ.35,570- కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్: నెలకు రూ.22,805దరఖాస్తు చివరి తేదీఈ కాంట్రాక్టు ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి అర్హతలు, ఇతర వివరాలు, దరఖాస్తు నమూనాను జోన్-1 పరిధిలోని సమీప ప్రభుత్వ ఐటీఐల్లో పొందవచ్చు.అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను 2026 సెప్టెంబర్ 28 సాయంత్రం 5 గంటలలోపు పంపించాలి.దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:ప్రాంతీయ ఉపసంచాలకుల కార్యాలయం,స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి మరియు శిక్షణ శాఖ,ఇండస్ట్రియల్ ఎస్టేట్, విశాఖపట్నం – 530007.గడువు ముగిసిన తర్వాత అందే దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోబోమని అధికారులు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *