Posted in

ప్రైవేట్ ఆసుపత్రులకు DMHO హెచ్చరిక.. నిబంధనలు పాటించాల్సిందే!

DM&HO VZM
DM&HO VZM

నిబంధనలు పాటించాల్సిందే!విజయనగరం: జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్స్, క్లినిక్‌లు, ల్యాబ్స్, స్కాన్ సెంటర్లు తప్పనిసరిగా ధరల పట్టికలను ప్రజలకు కనిపించేలా ప్రదర్శించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. జీవన్ రాణి ఆదేశించారు.స్కాన్ సెంటర్లలో PCPNDT చట్టం-1994 ప్రకారం అవగాహన బోర్డులు, టోల్ ఫ్రీ నంబర్, లింగ నిర్ధారణ నేరమనే హెచ్చరిక బోర్డులను తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి ఆసుపత్రికి ఫైర్ NOC తప్పనిసరి అని స్పష్టం చేశారు.ART, సరోగసీ కేంద్రాలు జాతీయ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, MTP నిర్వహించే ఆసుపత్రులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. ఐదేళ్లు పూర్తయిన MTP రిజిస్ట్రేషన్లను రెన్యువల్ చేసుకోవాలన్నారు.అలాగే అన్ని ఆసుపత్రుల్లో ICU వార్డులను ప్రభుత్వ మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అవసరమైన సౌకర్యాలతో నిర్వహించాలని, ICUలను మూడు గ్రేడ్లుగా విభజించి క్రమబద్ధమైన నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *