శృంగవరపుకోట: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా స్థానిక శృంగవరపుకోట శాఖా గ్రంథాలయంలో విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సర్వేపల్లి పాఠశాలకు చెందిన 32 మంది విద్యార్థులు ప్రతిభ కనబరిచి పలు విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలతో పాటు కన్సొలేషన్ బహుమతులు సాధించారు.
వేషధారణ పోటీలు – సీనియర్స్ విభాగం: ప్రథమ స్థానం – డి. ప్రజ్వలిత (రుద్రమదేవి), ద్వితీయ స్థానం – జి. లోహిత రామసాయి (చంద్రశేఖర్ ఆజాద్), తృతీయ స్థానం – కే. సాయి స్వరూప్ (మహాత్మా గాంధీ).
వేషధారణ పోటీలు – జూనియర్స్ విభాగం: ప్రథమ స్థానం – పి. శ్యామల (ఝాన్సీ లక్ష్మీబాయి), ద్వితీయ స్థానం – జి. పూర్ణచంద్ర సాయి (ఆర్మీ సోల్జర్), తృతీయ స్థానం – జి. అన్వేష్ (రైతు వేషధారణ), కన్సొలేషన్ బహుమతి – డి. నాగ డివిజ (గిరిజన వేషధారణ).
వక్తృత్వ పోటీలు (ఎలక్యూషన్) – సీనియర్స్: ప్రథమ స్థానం – ఉషాలాలిత్య, ద్వితీయ స్థానం – గీతామాధురి, తృతీయ స్థానం – శ్రీ లకిత్.
వక్తృత్వ పోటీలు – జూనియర్స్: ప్రథమ స్థానం – కుందన ప్రియ, ద్వితీయ స్థానం – షర్మిలా సాయి, తృతీయ స్థానం – బాహుల్య. అలాగే శ్రావ్య, అమృత, వర్షిణి, లాస్య, హాసిని పాల్గొని ప్రతిభ కనబరిచారు.
చిత్రలేఖన పోటీలు – సీనియర్స్: ప్రథమ స్థానం – సి.హెచ్. సోనాక్షి.
చిత్రలేఖన పోటీలు – జూనియర్స్: ప్రథమ స్థానం – ఎ. సాత్విక, ద్వితీయ స్థానం – జి. పూర్ణచంద్ర సాయి, తృతీయ స్థానం – జి. రవిచంద్ర, కన్సొలేషన్ బహుమతి – వై. మాన్విత.
వ్యాసరచన పోటీలు – జూనియర్స్: ద్వితీయ స్థానం – పి. జోష్ణవి, తృతీయ స్థానం – కే. రోషన్.
క్విజ్ పోటీలు: ప్రథమ స్థానం – పి. జ్ఞానేశ్వరి, బి. లాస్యశ్రీ. ద్వితీయ స్థానం – ఎస్.కె. నజినీన్ బేగం. తృతీయ స్థానం – ఎన్. కార్తికేయ.
డిబేట్ పోటీలు: ‘మహిళల్లో నాయకత్వ లక్షణాలు’ అనే అంశంపై నిర్వహించిన చర్చా పోటీలో ప్రథమ స్థానం – బి. గీతామాధురి, ద్వితీయ స్థానం – తనిష్క, తృతీయ స్థానం – ఉషాలాలిత్య సాధించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ పి. పైడిరాజు మాట్లాడుతూ, తమ పాఠశాల విద్యార్థులు వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచి విజయాలు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. విద్యార్థులు అధిక సంఖ్యలో బహుమతులు గెలుచుకోవడం పాఠశాలకు గర్వకారణమని కరస్పాండెంట్ సీహెచ్ సన్యాసిరావు పేర్కొన్నారు.
విజయం సాధించిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్లు వై. వెంకట్రావు, వి. సుశీల, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.
