Posted in

చెత్త ఏరుకునే కార్మికుల గౌరవానికి ప్రత్యేక కార్యక్రమం.. విశాఖ

Vishakapatnam
Vishakapatnam

దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో చెత్త ఏరుకునే కార్మికుల జీవనోపాధి, గౌరవాన్ని మెరుగుపరచాలనే ఉన్నత లక్ష్యంతో ఒక ప్రతిష్ఠాత్మక కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో 48 మంది వ్యర్థాల సేకరణ కార్మికులకు వారి దైనందిన అవసరాలకు ఉపయోగపడే అల్యూమినియం వంటపాత్రలు, అవసరమైన ప్లాస్టిక్ సామగ్రిని పంపిణీ చేయడం జరిగింది. ఇది కేవలం సహాయ కార్యక్రమం మాత్రమే కాకుండా, వారి శ్రమకు గుర్తింపుగా గౌరవప్రదమైన జీవనం వైపు ఒక ముఖ్యమైన అడుగుగా నిలిచింది

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ స్వయంగా కార్మికుల చేతుల మీదుగా సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో అత్యంత కష్టపడి పనిచేసే వ్యర్థాల సేకరణ కార్మికుల సేవలు అమూల్యమైనవని, నగర పరిశుభ్రతలో వారి పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో ముందుకు రావాలని సూచించారు.

దళిత బహుజన రిసోర్స్ సెంటర్ చేస్తున్న సేవలను కలెక్టర్ గారు ప్రత్యేకంగా అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ హెడ్ శ్రీ అనిల్ కుమార్, సభ్యులు నిఖిల, అజయ్, గురునాథ్, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వివిధ కాలనీల కమ్యూనిటీ నాయకులు కూడా హాజరై కార్మికులకు మద్దతు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *