Posted in

గూగుల్‌ AI తప్పుదోవ! తప్పుడు వైద్య సమాచారం వల్ల ప్రాణాలకు ముప్పు

AI
AI

లండన్:
గూగుల్‌ సెర్చ్‌లో ఇటీవల ప్రవేశపెట్టిన AI Overviews ఫీచర్‌లో తీవ్రమైన అక్యూరసీ లోపాలు ఉన్నాయని బ్రిటన్‌కు చెందిన ప్రముఖ పత్రిక ది గార్డియన్ శుక్రవారం ప్రచురించిన దర్యాప్తు నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా వైద్య సంబంధిత సెర్చ్ ఫలితాల్లో తప్పుడు సమాచారం పైభాగంలో కనిపించడం వల్ల వినియోగదారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


దర్యాప్తు ప్రకారం, గూగుల్‌ AI తయారు చేసిన సారాంశాలు కొన్ని సందర్భాల్లో ప్రమాదకరమైన మరియు వైద్య మార్గదర్శకాలకు విరుద్ధమైన ఆరోగ్య సూచనలను అందిస్తున్నాయి. ఒక అత్యంత తీవ్రమైన ఉదాహరణలో, పాంక్రియాటిక్ క్యాన్సర్ (అగ్న్యాశయ క్యాన్సర్) రోగులు అధిక కొవ్వు ఉన్న ఆహారాలను పూర్తిగా నివారించాలని AI సూచించినట్టు వెల్లడైంది.


వైద్య నిపుణుల ప్రకారం, ఈ సూచన పూర్తిగా తప్పుదారి పట్టించేదిగా ఉండటమే కాకుండా, రోగుల ఆరోగ్యాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టే అవకాశముందని హెచ్చరించారు. వాస్తవానికి, పాంక్రియాటిక్ క్యాన్సర్ రోగులు కీమోథెరపీ లేదా ప్రాణరక్షక శస్త్రచికిత్సను తట్టుకునేందుకు సరిపడా కాలరీలు, శక్తి అవసరమవుతుందని వైద్య మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.


ఈ అంశంపై ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ యూకే సంస్థలో పరిశోధన మరియు మద్దతు అధికారి అన్నా జ్యువెల్ మాట్లాడుతూ,
“ఈ తరహా సెర్చ్ ఫలితాలను రోగులు అనుసరిస్తే తగినంత ఆహారం తీసుకోవడం, బరువు పెరగడం కష్టమవుతుంది. దీని వల్ల క్యాన్సర్ చికిత్స లేదా ప్రాణరక్షక శస్త్రచికిత్సను భరించే సామర్థ్యం కోల్పోయే ప్రమాదం ఉంది,” అని హెచ్చరించారు.

AI ఆధారిత సెర్చ్ ఫలితాలు వేగంగా విస్తరిస్తున్న ఈ సమయంలో, సరైన పర్యవేక్షణ లేకుండా ఆరోగ్య సమాచారాన్ని వినియోగదారులకు అందించడం తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. గూగుల్‌ వెంటనే తన AI వ్యవస్థలను సవరించి, వైద్య సమాచారంలో ఖచ్చితత్వాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉందని వారు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *