Posted in

ఎస్.కోటలో ₹200 కోట్లతో హిలోరా ఈకో రిసార్ట్.. ఉత్తరాంధ్రకు మరో కలికితురాయి

Minister Kondapalli Srinivas
Minister Kondapalli Srinivas

విశాఖపట్నం, ఆగస్టు 14: ఉత్తరాంధ్ర పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేలా ఎస్.కోటలో భారీ ఈకో రిసార్ట్ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. 60 ఎకరాల విస్తీర్ణంలో సుమారు ₹200 కోట్ల పెట్టుబడితో హిలోరా ఈకో రిసార్ట్ నిర్మించేందుకు ఒప్పందం కుదిరింది.విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్‌లో శుక్రవారం నిర్వహించిన హిలోరా ఈకో రిసార్ట్స్ ఒప్పంద కార్యక్రమానికి రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుచూపుతో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు. హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంలో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.హిలోరా ఈకో రిసార్ట్స్, ద ఓజోన్ కలెక్షన్, కలర్స్ ఆఫ్ ఓ బ్లూ సంయుక్తంగా, ఏవీఎన్‌జీ డెవలపర్స్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు తెలిపారు. భోగాపురం అనంతరం ఉత్తరాంధ్రలో మరో కీలక ప్రాజెక్టుకు తొలి అడుగు పడటం సంతోషకరమని మంత్రి పేర్కొన్నారు.

ఊటీ, కొడైకెనాల్‌ను తలపించేలా..

ఎస్.కోటలో నిర్మించనున్న ఈ రిసార్ట్ ఆహ్లాదకరమైన ప్రకృతి వాతావరణంలో పర్యాటకులను ఆకట్టుకునేలా ఉంటుందని మంత్రి తెలిపారు. ఊటీ, కొడైకెనాల్ వంటి పర్యాటక ప్రాంతాలను తలపించే విధంగా రిసార్ట్‌ను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.వారాంతపు సెలవులను గడిపేందుకు ఇది ప్రత్యేక గమ్యస్థానంగా మారుతుందని, భవిష్యత్తులో సినీ ప్రముఖులు, పర్యాటకులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందన్నారు. జైపూర్‌కు దీటుగా ఫంక్షన్లు, ప్రత్యేక కార్యక్రమాలకు ఈ రిసార్ట్ ఆకర్షణగా నిలుస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.సంపద

సృష్టిపై కూటమి ప్రభుత్వం దృష్టితెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే మరోవైపు రాష్ట్రంలో సంపద సృష్టి, పెట్టుబడులను ప్రోత్సహించడంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. యువ నాయకుడు నారా లోకేష్ సారథ్యంలో కార్పొరేట్, ఫార్మా సంస్థలతో పాటు అనేక పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు.రెండేళ్లలోనే ఈ టూరిజం రిసార్ట్‌ను ప్రారంభిస్తామని సంస్థ ప్రతినిధులు చెప్పడం సంతోషకరమని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

ఉత్తరాంధ్రకు మరింత ఖ్యాతి

విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. అభివృద్ధికి నాంది పలికే ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారం అందిస్తున్నారని తెలిపారు. హిలోరా ఈకో రిసార్ట్ ద్వారా ఉత్తరాంధ్ర పర్యాటక రంగానికి మరింత ప్రాధాన్యత లభిస్తుందని, ఈ ప్రాంతానికి కొత్త ఖ్యాతి వస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సౌత్ ఆసియా ఎట్మాస్పియర్ కోర్ ఎండీ సౌభాగ్య మహాపాత్రో, ఏవీఎన్‌జీ డెవలపర్స్ ఎండీ ఏవీఎన్ గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *