Posted in

విజయనగరం గర్వంగా నిలిచిన క్షణం /భోగాపురం టెస్ట్ ఫ్లైట్ విజయవంతం

Central Minister k.Ram Murthy Naidu
Central Minister k.Ram Murthy Naidu

విజయనగరం:ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వానికి, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ, భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఢిల్లీ నుంచి నేరుగా వచ్చిన తొలి విమానం విజయవంతంగా ల్యాండ్ కావడం జిల్లా ప్రజలకు గర్వకారణమన్నారు. ఢిల్లీ–భోగాపురం రూట్ టికెట్‌ను చూసిన క్షణం అపార ఆనందం కలిగిందని తెలిపారు.

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు విజనరీ ఆలోచన నేడు కళ్లముందు సాకారమవుతుండటంతో భోగాపురం ప్రాంతమంతా పండగ వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. ఏవియేషన్ అధికారుల అంచనాల ప్రకారం భోగాపురం పరిసర ప్రాంతాల్లో భూమి విలువలు, విద్యాసంస్థలు, పెట్టుబడులు గణనీయంగా పెరుగనున్నాయని, మొదట 10 రెట్లు అభివృద్ధి అంచనా ఉంటే, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు 30–40 రెట్లు వరకు అభివృద్ధి అవకాశాలున్నాయని చెప్పడం ఈ ప్రాజెక్ట్ ప్రాధాన్యతను చాటుతోందన్నారు.

ఒకప్పుడు చిన్న గ్రామంగా ఉన్న శంషాబాద్ నేడు ప్రపంచ పటంలో గుర్తింపు పొందినట్లే, రానున్న రోజుల్లో భోగాపురం కూడా అంతర్జాతీయ స్థాయిలో కీలక కేంద్రంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఇంతటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించుకోవడం తనకు గర్వకారణమని, ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని నియోజకవర్గ ప్రజలకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు.

భోగాపురం విమానాశ్రయ టెస్ట్ ఫ్లైట్ చారిత్రాత్మకం నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి

నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి మాట్లాడుతూ, భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం విజయవంతంగా ల్యాండ్ కావడం ఉత్తరాంధ్ర చరిత్రలో చిరస్మరణీయ ఘట్టమని అన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నిరంతర మద్దతు, మార్గదర్శకత్వంతో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి సమయానుకూల సమన్వయం వల్లే ఈ విమానాశ్రయ కల రికార్డు సమయంలో నిజమైందని పేర్కొన్నారు.అత్యంత తక్కువ సమయంలో పనులను పూర్తి చేసి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఆపరేషన్ల దశకు తీసుకువచ్చిన అధికారులు, ఇంజినీర్లు, కార్మిక బృందాన్ని అభినందించారు. భోగాపురం విమానాశ్రయం ద్వారా విజయనగరం జిల్లా, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో విశాఖపట్నం ఎంపీ భరత్, జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఎస్. దామోదర్, జెసి సేధు మాధవన్, విజయనగరం, శ్రీకాకుళం, భీమునిపట్నం శాసనసభ్యులు అదితి గజపతిరాజు, గొండు శంకర్, గంటా శ్రీనివాసరావు, మార్క్‌ఫెడ్ ఎండి బంగార్రాజు, జీఎంఆర్ చైర్మన్, డీజీసీఏ, ఏఏఐ, ఎల్ అండ్ టి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *