Posted in

Vizianagaram: ఇచ్చిన హమీలన్నీ అమలు చేశాం.. జిల్లా ఇంచార్జ్ మంత్రి వంగలపూడి అనిత

AP home minister vangalapudi Anitha
AP home minister vangalapudi Anitha

విజయనగరం, అక్టోబర్ 04 : ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేశామని జిల్లా ఇంచార్జ్ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. మంచి కార్యక్రమాలను ఆమోదించడానికి ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు ఎల్లపుడు ముందుంటారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం వాహన మిత్ర పేరుతో 10 వేల రూపాయలను ఇచ్చేదని, ఈ మొత్తం సరిపోదని భావించిన ముఖ్యమంత్రి 15 వేలకు పెంచుతూ ఈ పధకాన్ని కొనసాగించారని తెలిపారు.

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం శనివారం స్థానిక మెసోనిక్ టెంపుల్ నందు జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ చార్జ్ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు  మెగా చెక్కును పంపిణీ చేసారు.  జిల్లాలో 15,479 మంది లబ్దిదారుల ఖాతాలలో 23  కోట్ల 21  లక్షల 85 వేల రూపాయలను నేరుగా జమ చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.  

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు కూటమి ప్రభుత్వం సంక్షేమం దిశగా మరో అడుగు వేసిందని, ఇప్పటికే పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న ప్రభుత్వమని అన్నారు. ఈ క్రమంలో డ్రైవర్ల సంక్షేమం కోసం ఆటో డ్రైవర్ సేవలో పథకానికి శ్రీకారం చుట్టామని, రాష్ట్రం లోని సొంత ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఆర్థికంగా అండగా నిలబడేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకం రూపొందించడం జరిగిందన్నారు. స్త్రీ శక్తి వలన ఆటో డ్రైవర్లు కొంత ఆదాయాన్ని కోల్పోతున్నామని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగానే వారికీ ఆర్ధిక సహాయం క్రింద సంవత్సరానికి 15 వేల రూపాయలను ఇచ్చేందుకు కాబినెట్ లో ఆమోదించడం జరిగిందని అన్నారు.

సూపర్ సిక్స్ ఎప్పుడు అని విమర్శించే వారి కళ్ళు తెరిపించేలా స్త్రీ శక్తి పేరుతో మహిళల కు ఉచిత బస్సు ప్రయాణం పధకాన్ని అమలు చేయడం జరిగిందని తెలిపారు. ఇది పేదల సేవలో ప్రభుత్వమని, రోజులో ముఖ్యమంత్రి 18 గంటలు పేదల కోసమే అలోచిస్తుంటారని పేర్కొన్నారు. రాష్ట్రంలో తల్లికి వందనం పథకాన్ని , అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుకు సాయం అందిస్తున్నామని తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఎస్. రాం సుందర్ రెడ్డి రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టో లో పేర్కొన్న విధంగా ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం నిర్వహించడం శుభ పరిణామన్నారు. 15,479 మంది లబ్దిదారుల ఖాతాలలో 23 కోట్ల 21 లక్షల 85 వేల రూపాయలు వారి బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరుగుతోందన్నారు.

మంత్రి జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ నుండి ఆటో ను కొంచం దూరం నడిపి, అదే ఆటో లో వేదిక వద్దకు చేరుకున్నారువిజయనగరం శాసన సభ్యులు పూసపాటి అదితి గజపతి రాజు మాట్లాడుతూ రైతు సేవలో, వికలాంగుల స్సేవలో, మహిళల సేవలో ప్రభుత్వం నిమగ్నమై ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం లో లబ్దిదారులు అప్పల రాజు మాట్లాడుతూ గత సారి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చంద్రబాబు నాయుడు రోడ్ టాక్స్ ను రద్దు చేసారని, ఈ సరి 15 వేలు వేసారని , అందుకు ధన్యవాదాలని తెలిపారు.ఇంకో లబ్దిదారు సన్యాసి రావు మాట్లాడుతూ 10 వ తరగతి అర్హత ఉంటె తప్ప లైసెన్స్ ఇచ్చేవారు కాదని, చంద్ర బాబునాయుడు గారు ఈ అర్హతను తీసి వేసి లైసెన్స్ లు ఇచ్చారని, వారికీ ధన్యవాదాలని తెలిపారు.ఈ కార్యక్రమం లో కాపు కార్పొరేషన్ యశస్వి , బి.జే.పి జిల్లా అధ్యక్షుడు రాజేష్ వర్మ , డిప్యూటీ కమీషనర్ అఫ్ ట్రాన్స్పోర్ట్ మణి కుమార్ ఎం.వి.ఐ లు, లబ్దిదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *