Posted in

Visakhapatnam: అక్రమ రైస్ నిల్వలతో పట్టుబడిన పెద్ది పాలెం రైస్ మిల్లులు..

Rice mill mafia
Rice mill mafia

ఆనందపురం, నవంబర్ 5: బుధవారం నాడు రాత్రి 9 గంటల నుండి 10 గంటల మధ్య భీమినిపట్నం రెవెన్యూ డివిజన్ అధికారి ఆదేశాలు మేరకు ఆనందపురం మండలం పెద్దిపాలెం గ్రామంలో రైస్ మిల్లులపై ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ స్థాయిలో అక్రమ బియ్యం నిల్వలు వెలుగులోకి వచ్చాయి.

ఆనందపురం తహసీల్దార్ ఎస్.శ్రీనుబాబు మరియు తన సిబ్బందితో కలిసి పెద్ది పాలెం గ్రామంలో మొత్తం మూడు రైస్ మిల్లుల వద్ద అనధికార రీతిలో నిల్వ చేసిన నిల్వలు గుర్తించారు.

శ్రీ బాలాజీ మోడ్రన్ రైస్ మిల్ premises‌లో మొత్తం 264 బస్తాలు 13.2 మెట్రిక్ టన్నుల బియ్యం మరియు బ్రోకెన్ రైస్ నిల్వలను సాంకేతిక బృందానితో పరీక్ష చేయగా, ప్రభుత్వం పధకాల ద్వారా పేదలకందించే పోర్టిఫైడ్ రైస్ గా గుర్తించారు. నిల్వలపై సరైన రికార్డులు, బిల్లులు సమర్పించలేకపోవడంతో కేసు నమోదు చేశారు.

అత్యవసర సరఫరా చట్టం–1955 (Essential Commodities Act) ప్రకారం రైస్ మిల్లు యజమాని చెన్నా దేవుళ్ళు కుమారుడు రామారావు పై క్రిమినల్ కేసు నమోదు చేశారు,

రైస్ మిల్లులను సీజ్ చేసి పట్టుబడిన అక్రమ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తదనాంతరం తహసీల్దార్ శ్రీనుబాబు మాట్లాడుతూ రేషన్ బియ్యం అక్రమంగా నిల్వలు చేయడం తరలించడం చట్ట ప్రకారం నేరమని వీటిపై నిరంతరం దాడులు నిర్వహిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *