విశాఖపట్నం: విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణకు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు..
మంగళవారం వైజాగ్‌లోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు మతుకుమిల్లి శ్రీ భరత్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మరియు సహచర ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొనడం జరిగింది…అనంతరం పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ “ప్లాంట్ నష్టాలకు కారణాలను వివరించారు… ఒక టన్ను స్టీల్ ఉత్పత్తి చేయడానికి టన్నున్నర ముడిసరుకు అవసరం. ఐరన్ ఓర్ లేకపోవడం వల్ల ప్లాంట్ నష్టాల్లో ఉందని అందరూ భావిస్తున్నారు. కానీ, వాస్తవానికి ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేయకపోవడమే నష్టాలకు ప్రధాన కారణం, అని ఆయన తెలిపారు.
గతంలో మూడు బ్లాస్ట్ ఫర్నేసుల్లో కేవలం రెండు మాత్రమే సామర్థ్యంతో నడిచాయని ప్రస్తుతం మూడు బ్లాస్టర్ ఫర్నేసుల్లో మూడు నడుస్తున్నాయని, దీంతో ప్లాంట్ లాభాల దిశగా పయనిస్తోందని ఆయన పేర్కొన్నారు.
మూడో బ్లాస్ట్ ఫర్నేస్ స్థాపించి 10 సంవత్సరాలైనా, 1,000 మంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం జరుగుతోందని, ప్లాంట్ లాభాల్లో నడవాలంటే దాని సామర్థ్యాన్ని పెంచడం కీలకమని ఆయన అన్నారు. ఒక టన్ను స్టీల్ ఉత్పత్తికి రూ.7,000 అదనంగా ఖర్చవుతోందని, కోకింగ్ కోల్‌ను ఆస్ట్రేలియా, ఇండోనేషియా నుంచి దిగుమతి చేస్తున్నామని ఆయన వివరించారు.
ఒక టన్ను స్టీల్‌కు 800 కేజీల కోకింగ్ కోల్ అవసరం. గంగవరం పోర్టు నుంచి టన్నుకు రూ.100కే దిగుమతి చేస్తున్నాం. అదే సేల్ పోర్టు నుంచి తీసుకుంటే రూ.3,000, వైజాగ్‌కు రవాణా చేయడానికి మరో రూ.3,000 ఖర్చవుతుంది. దీంతో టన్నుకు దాదాపు రూ.2,000 నష్టం వస్తోంది అని ఆయన తెలిపారు.
మైన్స్ 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వాటిని సమర్థవంతంగా ఉపయోగిస్తే ప్లాంట్ లాభాల్లో నడుస్తుంది. ప్లాంట్ అభివృద్ధికి నిధులు సమకూర్చేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. మేనేజ్మెంట్, కార్మికులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ప్లాంట్ అభివృద్ధి సాధ్యమతుందని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్రం నుంచి రూ.14,000 కోట్ల నిధులు తీసుకొచ్చామని, ప్లాంట్ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మబోమని ఆయన స్పష్టం చేశారు. ప్రైవేటీకరణను నిరోధిస్తూ, ప్లాంట్ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పల్లా శ్రీనివాస్ తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే లు శ్రీమతి కోళ్ల లలిత కుమారి, గణబాబు, విష్ణు కుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణ, వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
