గోవా, సెప్టెంబర్ 13: తెలుగుదేశం పార్టీలో చేరిన అనంతరం ఉమ్మడి విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజును గోవాలోని గవర్నర్ బంగ్లాలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా చిన్న శ్రీనుతో పాటు ఆయన కుమార్తె మజ్జి సిరి సహస్ర (సిరమ్మ) కూడా అశోక్ గజపతిరాజును కలిశారు. ఈ భేటీలో ఇరువురు ఆత్మీయంగా మాట్లాడుకుని పలు అంశాలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు కూడా పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీలో తన నూతన రాజకీయ ప్రయాణం నేపథ్యంలో అశోక్ గజపతిరాజును కలసి ఆయన ఆశీస్సులు తీసుకోవడం ఆనందంగా, గౌరవంగా ఉందని చిన్న శ్రీను తెలిపారు. విజయనగరం, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి పెద్దల సూచనలు, ఆశీస్సులతో ముందుకు సాగుతానని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు చిన్న శ్రీను, సిరి సహస్రలకు శుభాకాంక్షలు, ఆశీస్సులు అందించారు.
గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజును కలిసిన చిన్న శ్రీను
