న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: వెస్ట్ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో పెట్రోలు, డీజిల్, ఎల్పీజీ సరఫరా పై కేంద్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది.
ఇంధన కొరత లేదని స్పష్టం చేస్తూ, ప్రజలు గందరగోళానికి లోనై ఇంధనాన్ని అధికంగా కొనుగోలు చేయవద్దని సూచించింది.
పెట్రోలియం & నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకులు సాధారణంగా పనిచేస్తున్నాయి. ఎల్పీజీ పంపిణీ కూడా నిరంతరంగా కొనసాగుతోందని పేర్కొంది.
ప్రధాన అంశాలు:
పెట్రోలు, డీజిల్, ఎల్పీజీ నిల్వలు తగినంతగా ఉన్నాయని కేంద్రం స్పష్టం
వదంతులను నమ్మవద్దని ప్రజలకు సూచన
ఎల్పీజీ బుకింగ్‌లను ఆన్లైన్ ద్వారా చేయాలని విజ్ఞప్తి
అత్యవసర రంగాలకు (హాస్పిటల్స్, విద్యాసంస్థలు) ప్రాధాన్యత
అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు
ఇప్పటికే దేశవ్యాప్తంగా 4,000కి పైగా దాడులు నిర్వహించి, 1,300కి పైగా సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.అదేవిధంగా, పీఎన్జీ (PNG) కనెక్షన్ల విస్తరణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. మార్చి 2026 నుంచి 3.42 లక్షల కనెక్షన్లు అందించగా, మరో 3.7 లక్షల మంది నమోదు చేసుకున్నారు.
సముద్ర, విమాన రవాణా పరిస్థితి:భారత నౌకలు, సీ ఫారర్లు సురక్షితంగా ఉన్నారుఇప్పటివరకు 1,130 మందికి పైగా భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకువచ్చారు
ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు 6.49 లక్షల మంది భారత్‌కు చేరుకున్నారుమొత్తంగా పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం సమీక్షిస్తూ, రాష్ట్రాలతో సమన్వయం కొనసాగిస్తోందని తెలిపింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండి, ఇంధనాన్ని సంరక్షణతో వినియోగించాలని ప్రభుత్వం సూచించింది.
