విజయనగరం, అక్టోబర్ 3:
స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర (SASA) కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ 2025లో విజయనగరం జిల్లా మరోసారి ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాకు రెండు రాష్ట్రస్థాయి అవార్డులు, 48 జిల్లాస్థాయి అవార్డులు లభించాయని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు.
జిల్లా కలెక్టర్ శుక్రవారం స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కార్యదర్శి సురేష్ కుమార్ పలు సూచనలు చేస్తూ అవార్డుల ఎంపిక తడి–పొడి చెత్త నిర్వహణ, ప్లాస్టిక్ తగ్గింపు, RRR (Reduce, Reuse, Recycle), సుస్థిర పద్ధతులు వంటి ప్రమాణాల ఆధారంగా జరిగిందని వివరించారు.
రాష్ట్రస్థాయి అవార్డుల విభాగంలో ఎపిఇపిడిసిఎల్ కార్యాలయం (స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయం) మరియు బొబ్బిలి మున్సిపాలిటీ (50 వేల నుండి ఒక లక్ష జనాభా విభాగం) ఎంపికయ్యాయి.
జిల్లాస్థాయిలో మొత్తం 48 అవార్డులు లభించాయి. అందులో:
బెస్ట్ స్వచ్ఛత గ్రీన్ అంబాసిడర్లు: బాడంగి మండలం తెంటు వలస పంచాయతీకి చెందిన భీమయ్య దాసు, విజయనగరం మండలం చెల్లూరు పంచాయతీ జి అప్పన్న, చీపురుపల్లి మండలం కర్లాం పంచాయతీ బి అప్పలస్వామి, ఎల్ కోట మండలం పోతంపేట పంచాయతీ బోర దేముడు, గజపతినగరం పంచాయతీ డి మహంకాళి.
బెస్ట్ స్వచ్ఛత ఎన్జీవో: స్పార్క్ సొసైటీ.
బెస్ట్ స్వచ్ఛత వారియర్స్: విజయనగరం, బొబ్బిలి, రాజాం, నెల్లిమర్ల మున్సిపాలిటీలకు చెందిన ఐదుగురు సిబ్బంది.
స్వచ్ఛ అంగన్వాడీలు: భూసాయ వలస, గొల్లల వలస, జామి, మదనాపురం, రాకోడు కేంద్రాలు.
స్వచ్ఛ బస్ స్టేషన్: రాజాం.
స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయం: బొబ్బిలి సబ్ ట్రెజరీ ఆఫీస్.
స్వచ్ఛ గ్రామ పంచాయతీలు: ఆకులకట్ట, అంబటివలస, ద్వారపూడి, నందిగామ, తుమికాపల్లి.
స్వచ్ఛ ఆస్పత్రులు: పూసపాటి రాగా పిహెచ్సి, రాజాం ఏరియా ఆసుపత్రి, గరివిడి పిహెచ్సి.
స్వచ్ఛ హాస్టల్స్: పెరుమాలి బాయ్స్ హాస్టల్, చీపురుపల్లి బీసీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్, బొబ్బిలి జీటిడబ్ల్యూ ఆశ్రమ పాఠశాల.
స్వచ్ఛ ఇండస్ట్రీస్: ఎస్ఎంఎస్ ఫార్మాసిటికల్స్, ధనిక ఆక్వా ఎక్స్పోర్ట్స్, మహి ఎడిబుల్ ఆయిల్స్.
స్వచ్ఛ మున్సిపాలిటీ: విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్.
స్వచ్ఛ రెసిడెన్షియల్ స్కూల్: వేపాడ గురుకులం.
స్వచ్ఛ రైతు బజార్: ఎస్.కోట రైతుబజార్.
స్వచ్ఛ పాఠశాలలు: రంగరాయపురం ఎంపీపీ స్కూల్, కొత్తపేట వివేకానంద ఎంపీపీ స్కూల్, కుమరాం కేజీబీవీ, కొట్టక్కి జడ్పీ హైస్కూల్, కొత్తవలస అర్ధనాపాలెం ఏపీఎంఎస్.
స్వచ్ఛ ఎస్ ఎల్ ఎఫ్: అమ్మ జ్యోతి పిఎస్‌పిపిపి లిమిటెడ్, బాబామెట్ట పిఎస్‌పిపిపి లిమిటెడ్, వైయస్సార్ అర్బన్ ఐకెపి సహకార సంఘం.
స్వచ్ఛ విలేజ్ ఆర్గనైజేషన్లు: ద్వారపూడి, కాలం రాజుపేట, ముగడ, పినతాడివాడ, పోలయవలస.
ఈ అవార్డులను ఈనెల ఆరవ తేదీన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానం చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అన్ని విజేతలకు అభినందనలు తెలిపారు.
