విశాఖపట్టణం, నవంబర్ 07 ః స్థానిక మర్రిపాలెంలో ఉన్న బంధువుల సాయంతో హైదరాబాద్ లోని ధూమకొండ ప్రాంతానికి చెందిన వి. దేవి, చికిత్స పొందుతూ మృత్యువాత పడిన ఘటనపై, కొన్ని టీవీ చానల్స్, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై కేజీహెచ్ వైద్యాధికారులు స్పందించారు.
మృతికి గల కారణాలను వెల్లడించారు. సూపరింటెండెంట్ డా. ఐ. వాణి మాట్లాడుతూ “దేవి అనే మహిళ 06వ తేదీ తెల్లవారు ఝాము 2.45 గంటలకు అడ్మిట్ అయ్యారు. డ్యూటీ డాక్టర్ చూశారు. అక్కడ నుంచి రాజేంద్రప్రసాద్ వార్డుకు తరలించారు. ప్రాథమిక పరీక్షల అనంతరం చికిత్స మొదలైంది. ఆమె జ్వరం, ఒళ్లునొప్పులు, వాంతులు తదితర కారణాలతో జాయిన్ అయ్యారు. కంప్లైంట్ హిస్టరీ చూశాం. ఆల్కహాల్ కు అడిక్ట్ అయి ఉన్నట్లు అర్థమయ్యింది. దేవి ఆక్సిజన్ లెవెల్స్ బాగున్నాయి. 93% నుంచి 97% వరకు ఉంది. బీపీ కూడా బాగానే ఉంది. కాకపోతే పల్స్ కొంచెం ఎక్కువగా ఉంది. ఆమెను సాధారణ వార్డులోనే చికిత్స అందించారు.
గురువారం మధ్యాహ్నం ఇన్వెస్టిగేషన్ లో లివర్ సామర్థ్యం తగ్గటం గమనించాం. దానికి ఆల్క్ హాలే కారణంగా అర్థమయ్యింది. లివర్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నట్లు ఆల్ట్రా సౌండ్ రిపోర్టులో తేలింది. ఆమె జ్వరానికి వివిధ కారణాలు ఉండి ఉండొచ్చు. పూర్తి స్థాయి రిపోర్టులు రావాల్సి ఉంది. ఆమెకు ఆక్సిజన్ సపోర్టు అవసరం లేదు. అయితే ఆమె పరిస్థితి రాత్రికి ఉన్నట్టు ఉండి ఒక్కసారిగా మారిపోయింది. సీపీఆర్ చేశారు. అయినప్పటికీ ఆమెను మృతి చెందారు.
ఆమె ఆక్సిజన్ లెవెల్స్ బాగానే ఉండటంతో బయట నుంచి ఆక్సిజన్ ఇవాలిన అవసరం రాలేదు. 06వ తేదీ తెల్లవారు ఝాము 2.45 గంటలకు అడ్మిట్ అయిన దేవి, గురువారం రాత్రి 11.10కి చనిపోయారు. ఆమె చనిపోవడానికి ఆక్సిజన్ లేకపోవటం అనేది కారణమే కాదు” అని వివరించారు.
విద్యుత్ సరఫరా నిలిచిపోవడానికి, ఆక్సిజన్ అందకపోవడానికి సంబంధం లేదని సూపరింటెండెంట్ స్పష్టం చేశారు. అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకున్నామని వివరించారు.రాజేంద్రప్రసాద్ వార్డు యూనిట్.3లో వైద్యం అందించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్. శ్రీకాంత్ మాట్లాడుతూ.. “45 ఏళ్ల వయసు గల దేవి అనే మహిళ జ్వరం, ఒళ్లునొప్పులతో అడ్మిట్ అయ్యారు. క్యాజువాలిటీలో ఎగ్జామిన్ అయ్యాక ఐసీయూలో సమారు నాలుగు గంటలు ఉన్నారు. ఆక్సిజన్ అవసరం లేనందున సాధారణ వార్డుకు తరలించాం. పరిస్థితి అంతా బాగానే ఉంది. అయితే రాత్రికి ఉన్నట్టుండి 11.00 గంటలకు పరిస్థితి మారింది. కార్డియాటిక్ అరెస్టుకు గురయ్యారు. ఉదయం ఇన్విస్టిగేషన్ ను బట్టి ఆల్క్ హాల్ వల్ల ఆమె లివర్ దెబ్బతిన్నట్లు తేలింది. మరళా ఆల్ట్రా సౌండ్ చేయగా లివర్లో రాళ్లు ఉన్నట్లు తేలింది. దానికి అనుగుణంగా చికిత్స అందించాం. హఠాత్తుగా 11 గంటలకు ఆమె వైద్యానికి స్పందించలేదు. గుండెపోటు రావటంతో ఆమె చినిపోయారు” అని పేర్కొన్నారు.

Awesome post! Really enjoyed reading it.