లక్కవరపుకోట/శృంగవరపుకోట, ఆగస్టు 25:కూటమి ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ ద్వారా యువతకు ఉపాధి కల్పనలో చరిత్ర సృష్టించిందని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు.
యువతకు ఇచ్చిన హామీ మేరకు 16,347 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించామని, ఇకపై ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహించి విద్యా రంగాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులకు వయస్సులో మినహాయింపులు ఇచ్చి వారిని ప్రోత్సహించామని చెప్పారు.యువత అభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్మోహన్ రెడ్డి 24 కేసులు పెట్టినా వాటన్నింటినీ ఎదుర్కొని మెగా డీఎస్సీని విజయవంతంగా పూర్తిచేసిన ఘనత నారా లోకేష్‌దేనని ఆమె కొనియాడారు.
విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, స్టూడెంట్-టీచర్ రేషియోను సక్రమంగా అమలు చేయడమే విద్యా రంగ ముఖచిత్రాన్ని మార్చగలదని నమ్మిన లోకేష్ గారి నాయకత్వంలో యువత కల నిజమైందని ఆమె అన్నారు.
గత 14 నెలలుగా నూతన సంస్కరణలతో ప్రభుత్వ విద్యలో నాణ్యతా ప్రమాణాలను పెంచుతూ బడులకు కొత్త వెలుగులు తెచ్చిన నారా లోకేష్‌గారు విద్యావంతుడైన నాయకుడని ఆమె కొనియాడారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం రెండు డీఎస్సీల ద్వారా 18 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేసిందని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 14 ఏళ్ల కాలంలో 13 డీఎస్సీల ద్వారా 1,80,208 పోస్టులు భర్తీ చేసి రికార్డు సృష్టించారని గుర్తుచేశారు.
ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల్లో అధిక శాతం ఆయన హయాంలో ఉద్యోగాలు పొందిన వారేనని పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమగ్ర శిక్ష సొసైటీ ఆధ్వర్యంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 729 నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయడం, అలాగే 90 మంది ఎస్టీ యువతను కొత్తగా ఉపాధ్యాయులుగా నియమించడం ద్వారా విద్యా రంగంలో సమతుల అభివృద్ధికి కృషి చేస్తోందని ఎమ్మెల్యే లలిత కుమారి తెలిపారు.
