విజయనగరం, జనవరి 7:
నిరుద్యోగ యువతి, యువకులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా జిల్లా ఉపాధి కార్యాలయం, విజయనగరం ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాను తేదీ: 08-01-2026 (గురువారం) ఉదయం గం. 10:00 గంటలకు విజయనగరం పట్టణంలోని మహారాజా కాలేజ్ (ఆటోనమస్), క్లాక్ టవర్ సమీపం, తుపకుల వీధిలో నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తెలిపారు.
ఈ జాబ్ మేళాలో ఆర్విక్స్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వసిష్ట ఫార్మా కెమ్, మంజుశ్రీ టెక్నో ప్యాక్ లిమిటెడ్ సంస్థలు పాల్గొని వివిధ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక చేపట్టనున్నాయి.
ఉద్యోగ ఖాళీల వివరాలు:
- ఆర్విక్స్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్
ఉద్యోగం: కెమిస్ట్
ఖాళీలు: 25
వయస్సు: 18–30 సంవత్సరాలు
జీతం: రూ.15,000/- నుండి రూ.17,000/-
విద్యార్హత: ఇంటర్ / బి.ఎస్సి (కెమిస్ట్రీ)
జాబ్ లొకేషన్: పరవాడ
అభ్యర్థులు: పురుషులు - వసిష్ట ఫార్మా కెమ్
ఉద్యోగం: కెమిస్ట్
ఖాళీలు: 30
వయస్సు: 18–30 సంవత్సరాలు
జీతం: రూ.15,000/- నుండి రూ.17,000/-
విద్యార్హత: ఇంటర్ / ఏదైనా డిగ్రీ
జాబ్ లొకేషన్: అచ్యుతాపురం (అనకాపల్లి)
అభ్యర్థులు: పురుషులు - మంజుశ్రీ టెక్నో ప్యాక్ లిమిటెడ్
ఉద్యోగం: అప్రెంటీసెస్
ఖాళీలు: 50
వయస్సు: 18–30 సంవత్సరాలు
జీతం: రూ.15,000/- నుండి రూ.17,000/-
విద్యార్హత: ఎస్సెస్సీ / ఇంటర్ / ఏదైనా డిగ్రీ
జాబ్ లొకేషన్: అచ్యుతాపురం (అనకాపల్లి)
అభ్యర్థులు: పురుషులు
జాబ్ మేళాకు హాజరు విధానం:
అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా
👉 www.employment.ap.gov.in
👉 www.ncs.gov.in
వెబ్సైట్లలో Job Seeker Login ద్వారా నమోదు చేసుకోవాలి.
తదనంతరం బయోడేటా, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో జాబ్ మేళా జరిగే రోజు హాజరుకావాలని జిల్లా ఉపాధి అధికారి, విజయనగరం తెలియజేశారు.
