Posted in

Jobs: KGBVలలో 73 బోధనేతర పోస్టులు

Jobs
Jobs

విజయనగరం, జనవరి 05, 2026:
విజయనగరం జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు (KGBV) లో ఖాళీగా ఉన్న 73 బోధనేతర (Non-Teaching) పోస్టులను అవుట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు సమగ్ర శిక్షా అదనపు పథక సమన్వయకర్త ఎ. రామారావు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ పోస్టుల భర్తీకి అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తులు ఆఫ్‌లైన్ విధానంలో (నేరుగా కార్యాలయంలో సమర్పించాలి) స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.
దరఖాస్తు స్వీకరణ తేదీలు:
👉 06.01.2026 నుంచి 20.01.2026 వరకు
👉 కార్యాలయ పనిదినములలో
👉 ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు
దరఖాస్తులను అదనపు పథక సమన్వయకర్త కార్యాలయం, సమగ్ర శిక్షా, విజయనగరం కు సమర్పించాలన్నారు.
ఖాళీల వివరాలు:
టైపు–III KGBVs:
వోకేషనల్ ఇన్స్ట్రక్టర్లు – 10
కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లు – 12
ఏ.ఎన్.ఎం – 7
అటెండర్ – 4
అసిస్టెంట్ కుక్ – 5
డే & నైట్ వాచ్ ఉమెన్ – 1
స్కావెంజర్ – 7
టైపు–IV KGBVs:
పార్ట్ టైమ్ టీచర్స్ – 7
వార్డెన్ – 4
కుక్ – 11
చౌకీదారులు – 5
అర్హతలు & వయోపరిమితి:
కుక్, స్వీపర్, వాచ్ ఉమెన్, అటెండర్ వంటి పోస్టులకు ప్రత్యేక విద్యార్హతలు అవసరం లేదని తెలిపారు. ఇతర సాంకేతిక పోస్టుల అర్హతల పూర్తి వివరాలకు vizianagaram.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
వయోపరిమితి (01.07.2025 నాటికి):
సాధారణ అభ్యర్థులు: 18 – 45 సంవత్సరాలు
SC / ST / BC / EWS అభ్యర్థులు: 50 సంవత్సరాల వరకు
మాజీ మహిళా సైనిక ఉద్యోగులు: 45 సంవత్సరాల వరకు
ఈ నియామకాలు మండల యూనిట్ ప్రాతిపదికన ఇంటర్వ్యూల ద్వారా నిర్వహించనున్నట్లు తెలిపారు. కాబట్టి, ఏ మండలంలో ఖాళీలు ఉన్నాయో, ఆ మండలానికి చెందిన మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని స్పష్టం చేశారు.
మరిన్ని వివరాల కోసం విజయనగరం జిల్లా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు కోరారు.

One thought on “Jobs: KGBVలలో 73 బోధనేతర పోస్టులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *