విశాఖపట్నం జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం – ఉపాధి & శిక్షణ శాఖ, నేషనల్ కెరీర్ సర్వీస్ సహకారంతో 2026 జనవరి 9వ తేదీ (శుక్రవారం) ఉదయం 10.00 గంటల నుంచి విశాఖపట్నంలో భారీ స్థాయి జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ జాబ్ మేళా విశాఖపట్నం – Govt. ITI (Girls) క్యాంపస్, ఓల్డ్ ఐటీఐ రోడ్, కంచరపాలెం లో జరగనుంది. ఈ కార్యక్రమంలో ఇన్నోవ్ సోర్స్, భారత్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్, పేటీఎం, అపోలో ఫార్మసీ, రేయాన్ సోలార్ సిస్టమ్, టాటా ఎలక్ట్రానిక్స్, గూగుల్ పే, మహీంద్రా ప్రైవేట్ లిమిటెడ్ వంటి 8 ప్రముఖ సంస్థలు పాల్గొననున్నాయి.
ఈ జాబ్ మేళా ద్వారా 800కు పైగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉండగా, SSC, ITI, ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ అర్హతలు కలిగిన యువతీ–యువకులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్, విశాఖపట్నం, గాజువాక, విజయనగరం, ఏపీ & తెలంగాణ, బెంగళూరు వంటి ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు జరగనున్నాయి.
ఉద్యోగాలకు అనుగుణంగా నెలకు రూ.7,000 నుంచి రూ.35,000 వరకు జీతాలు, PF, ESI, EPF, ఉచిత భోజనం, వసతి, రవాణా వంటి సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. వయోపరిమితి 18 నుంచి 37 సంవత్సరాల వరకు ఉంటుందని తెలిపారు.
జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు రిజ్యూమ్, అన్ని విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. అలాగే ముందుగా employment.ap.gov.in లేదా www.ncs.gov.in వెబ్‌సైట్లలో నమోదు చేసుకోవాలని తెలిపారు.
ఈ జాబ్ మేళా ద్వారా జిల్లాలోని నిరుద్యోగ యువతకు మంచి అవకాశాలు లభిస్తాయని జిల్లా ఉపాధి అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలకు జొన్నాడుల శ్రీహరి – 9160888066 ను సంప్రదించవచ్చని తెలిపారు.
విశాఖలో భారీ జాబ్ మేళా – 8 ప్రముఖ కంపెనీల ద్వారా 800కుపైగా ఉద్యోగ అవకాశాలు
