విజయనగరం, ఆగష్టు 21 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ నిమిత్తం 20 సం.ల వయస్సు పైబడిన ఆసక్తిగల షెడ్యూల్డు కులముల అభ్యర్దులు, కనీసం 1 సంవత్సరం కాల పరిమితి గల లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగియున్న పురుషులు/స్త్రీలు నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మరియు ఎస్.సి. కార్పొరేషన్ చైర్మన్ డా.బి.ఆర్.అంబేద్కర్ తెలిపారు. దరఖాస్తులను కార్యనిర్వాహక సంచాలకులు, జిల్లా షెడ్యూల్డు కులముల సేవా సహకార సంస్థ, డా.మర్రిచెన్నారెడ్డి భవన౦, కంటోన్మెంట్, విజయనగరం-535003 వారికి తే.21-08-2025దీ నుండి తే.27-08-2025దీ లోగా సమర్పించవలసి ఉంటుందని ఆ ప్రకటన లో తెలిపారు. ఈ శిక్షణ కు 5 గురు స్త్రీ, 5 గురు పురుష అభ్యర్ధులను మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుందని, శిక్షణ కుసంబంధించిన ఫీజు కార్పొరేషన్ ద్వారా భరించడం జరుగుతుందని తెలిపారు.
ఆశక్తి గల అభ్యర్ధులు తగు సమాచారము నిమిత్తం ఈ ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని తెలిపారు.
1) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ : 9030014742,2) సీనియర్ అసిస్టెంట్,: 9642460838,
3) జూనియర్ అసిస్టెంట్ : 9652600967
దరఖాస్తు నమూనా
ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. (APSRTC) డ్రైవింగ్ స్కూల్ ద్వారా హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ (HMV) శిక్షణ కొరకు దరఖాస్తు
| 1. అభ్యర్ధి యొక్క పేరు | : | |
| 2. తండ్రి/భర్త పేరు | : | |
| 3.పుట్టిన తేది/వయస్సు | : | |
| 4.విద్యార్హత (జెరాక్సు కాపీ జత చేయవలెను) | : | |
| 5.ఆధార్ కార్డు నెం. (జెరాక్సు కాపీ జత చేయవలెను) | : | |
| 6. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ (LMV) లైసెన్స్ బ్యాడ్జి నెం. | : | |
| 7. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ (LMV) లైసెన్స్ నెం.మరియు కాలపరిమితి వివరములు (జెరాక్సు కాపీ జత చేయవలెను) | : | |
| 8. హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ (HMV) (LLR) నెం. మరియు కాలపరిమితి వివరములు (జెరాక్సు కాపీ జత చేయవలెను) | : | |
| 9.మొబైల్ నెం. | : | |
| 10. చిరునామా పిన్ కోడ్ తో సహా | : | |
| 11.ఎ.పి.ఎస్.ఆర్.టి.సి.వారి నియమ నిబంధనలకు తెలియజేయు అంగీకారము (అవును/కాదు) | : |
