Posted in

జాతీయ క్రీడా దినోత్సవం లో మంత్రి నారా లోకేష్

Nara Lokesh
Nara Lokesh

విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయ కన్వెన్షన్ హాల్‌లో శాప్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగారిగింది.

ఈ కార్యక్రమానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకలో ముందుగా జ్యోతిప్రజ్వలన చేసి, మేజర్ ధ్యాన్ చంద్, తెలుగు భాషా వికాసానికి కృషి చేసిన గిడుగు రామ్మూర్తి చిత్రపటాలకు నివాళులర్పించారు.తరువాత ఏర్పాటు చేసిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ,

“ఎనర్జీ, టాలెంట్, డిటర్మినేషన్ మన ఆంధ్ర రాష్ట్ర యువకుల బ్లడ్‌లోనే ఉంది. క్రీడల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడమే లక్ష్యం. చంద్రబాబు గారి నాయకత్వంలో ఇప్పటికే ఒక గ్రాస్‌రూట్ మూమెంటమ్‌ను ప్రారంభించాం. ఈరోజు మన ముందున్న 462 మంది రాష్ట్రస్థాయి విజేతలు ఆ ప్రారంభానికి నిదర్శనం” అని అన్నారు.

క్రీడల ప్రాధాన్యం – ప్రభుత్వ లక్ష్యంమంత్రి లోకేష్ మాట్లాడుతూ, క్రీడల ద్వారా పిల్లలను యూట్యూబ్, పబ్‌జీ వంటి అలవాట్ల నుంచి దూరం చేయాలని, క్రీడా సంస్కృతిని గ్రామాల వరకు విస్తరింపజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రైవేట్ సంస్థలు కూడా ముందుకు రావాలని, జేఎస్‌డబ్ల్యూ, జీఎంఆర్ వంటి సంస్థలు చేస్తున్న సహకారం అభినందనీయమని అన్నారు. దేశానికే కాదు, ప్రపంచానికే ఆంధ్రప్రదేశ్‌ను క్రీడా రాజధానిగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

విద్యా వ్యవస్థలో మార్పులువిద్యార్థుల శారీరక, మానసిక వికాసం కోసం విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువస్తున్నామని, అందులో భాగంగా ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’ అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఆ రోజున విద్యార్థులకు లైఫ్ స్కిల్స్, క్రీడలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.

మౌలిక వసతులు – ఆరోగ్యకర సమాజంప్రభుత్వం క్రీడల కోసం ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. “మంగళగిరిలో 45 పార్కులను నిర్మిస్తున్నాం. ఇది కేవలం క్రీడలకే కాకుండా ప్రజల ఆరోగ్యం, సోషల్ ఇంటిగ్రేషన్ కోసం కూడా. సింగపూర్‌లోలాగే సోషల్ హార్మనీని సృష్టించాల్సిన అవసరం ఉంది” అని అన్నారు.

పట్టుదల – విజయ రహస్యంజీవితంలో విజయానికి పట్టుదల, కసి తప్పనిసరిగా ఉండాలని లోకేష్ అన్నారు. “చంద్రబాబు గారు, మోదీ గారి జీవితాలను చూస్తే విజయాలే కనబడతాయి. కానీ వాటి వెనుక ఎన్నో వైఫల్యాలు ఉన్నాయి. ఫెయిల్యూర్స్ ఎప్పుడూ వారిని ఆపలేదు. అదే మనం నేర్చుకోవాల్సిన పాఠం” అని యువతను ఉత్సాహపరిచారు.

విద్యాశాఖ మద్దతువిద్యాశాఖ నుంచి క్రీడాకారులకు ఎలాంటి సహాయం కావాలన్నా అందజేస్తామని, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతులు, రిజర్వేషన్లలో తగిన ప్రాధాన్యత కల్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు.

క్రీడలతో పాటు ఆరోగ్యకరమైన సమాజం నిర్మించాల్సిన అవసరం ఉందని, డయాబెటిస్ వంటి వ్యాధులను ఎదుర్కోవడంలో క్రీడలు కీలకమని అన్నారు.

ప్రముఖ క్రీడాకారుల సత్కారం..

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ క్రీడాకారులు పి. గోపీచంద్, ఎంఎస్‌కే ప్రసాద్, కోనేరు హంపీలను మంత్రి లోకేష్ ఘనంగా సత్కరించారు. అలాగే సాకేత్ సాయి మైనేని, యర్రాజి జ్యోతి, ఈ. రజిని, డి. జ్యోతికశ్రీ, షేక్ జెఫ్రిన్, పి. శివారెడ్డి, సత్యగీత తదితర క్రీడాకారులను కూడా సన్మానించారు

.ప్రముఖుల హాజరు

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ శ్రీభరత్, మంత్రులు వంగలపూడి అనిత, డోలా బాలవీరాంజనేయ స్వామి, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, ఎండీ పీఎస్ గిరీషా, ఎమ్మెల్యే గణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *