Posted in

ప్రజా సమస్యల పరిష్కారమే జనవాణి లక్ష్యం : ప్రభుత్వ విప్ హరిప్రసాద్

Mlc Hariprasad
Mlc Hariprasad
  • అప్కోస్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులతో సమావేశం

అమరావతి, సెప్టెంబర్ 17:
జనసేన పార్టీ కార్యాలయంలో జరుగుతున్న జనవాణి కార్యక్రమం రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కార వేదికగా నిలుస్తోందని శాసనమండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ తెలిపారు. ప్రతి పౌరుడి వేదన విని, దానికి తగిన పరిష్కారం చూపించడం జనసేన పార్టీ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

మంగళవారం రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసిన అప్కోస్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులతో హరిప్రసాద్ , పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ , పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ శ్రీకళ్యాణం శివ శ్రీనివాస్ చర్చలు జరిపారు.

  • 13 వేల వేతనంతో ఏళ్ల తరబడి సేవలు

ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 90 వేల ఎఫ్ఎన్ఎల్ ఉద్యోగులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎన్నో ఏళ్లుగా కేవలం రూ.13 వేలతోనే జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
“సమాన పనికి సమాన వేతనం అందేలా చర్యలు తీసుకోవాలి” అని వారు విజ్ఞప్తి చేశారు. గతంలో తమ సమస్యలను ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసినప్పుడు చాలా వరకు పరిష్కారం లభించిందని, ఇప్పుడు కూడా అదే ఆశతో వచ్చామని చెప్పారు.

  • ప్రతి సమస్య మానిటరింగ్

దీనిపై స్పందించిన హరిప్రసాద్ –
“జనవాణిలో ప్రజలు తెలిపే ప్రతి సమస్యను ప్రత్యేకంగా మానిటర్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏర్పాట్లు చేశారు. ఇంతకుముందు అప్కోస్ ప్రతినిధులు ప్రస్తావించిన సమస్యలకు తక్షణమే స్పందించి పరిష్కారం కల్పించారు. ఇప్పుడు తెలిపిన అంశాలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తాం. అందరికీ తగిన న్యాయం జరగాలన్నదే జనసేన లక్ష్యం” అని తెలిపారు.

  • కారుణ్యప్రజా సమస్యల పరిష్కారమే జనవాణి లక్ష్యం :

రాష్ట్రవ్యాప్తంగా జడ్పీ పాఠశాలల్లో ఆరు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలు చేయాలని అభ్యర్థులు సమావేశంలో కోరారు. ఇంటి దిక్కును కోల్పోయి వేదనలో ఉన్న కుటుంబాలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, తక్షణమే నియామకాలు జరగాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని హరిప్రసాద్ హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *