ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా 19 నవంబర్ 2026న విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH) లెక్చర్ హాల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు *“ఇన్సులిన్ థెరపీ – సురక్షిత విధానాలు”* అనే అంశంపై నర్సింగ్ సిబ్బందికి అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రి ప్రిన్సిపాల్ డా. బి. దేవి మాధవి, మెడికల్ సూపరింటెండెంట్ డా. ఎ. పద్మజ, వైస్ ప్రిన్సిపాల్ డా. లోకనాథ్ మార్గదర్శకత్వంలో, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డా. బి. సుదర్శి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జనరల్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డా. ఎ.ఎస్.వి. కార్తీక్ ఇన్సులిన్ ఎంపిక, మోతాదు, నిల్వ, ఇంజెక్షన్ విధానం, రక్తంలో చక్కెర స్థాయిల పర్యవేక్షణ, హైపోగ్లైసీమియా నివారణ మరియు అత్యవసర నిర్వహణపై ప్రసంగించారు. అనంతరం జనరల్ మెడిసిన్ విభాగం అధ్యాపకులు, పీజీ వైద్య విద్యార్థులు నర్సింగ్ సిబ్బందికి ఇన్సులిన్ సిరంజి, పెన్ వినియోగం, ఇంజెక్షన్ విధానం, గ్లూకోమీటర్ ద్వారా రక్తంలో చక్కెర పరీక్ష వంటి అంశాల్లో ప్రాయోగిక శిక్షణ అందించారు.
ఈ కార్యక్రమంలో జనరల్ మెడిసిన్ విభాగం అధ్యాపకులు, పీజీ విద్యార్థులు మరియు నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఇన్సులిన్ వినియోగంలో భద్రతను పెంపొందించి, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఈ శిక్షణ ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన జనరల్ మెడిసిన్ విభాగాన్ని మెడికల్ సూపరింటెండెంట్ డా. ఎ. పద్మజ అభినందించారు
