ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ‘ప్రెస్ సేవ’ పోర్టల్ ప్రారంభం – పత్రికలు, ( పిరియాడికల్స్) పత్రికల రిజిస్ట్రేషన్ సులభతరంభారత ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ (PRGI) యోగేష్ బవేజా మాట్లాడుతూ, పత్రికలు మరియు పత్రికలు పిరియాడికల్స్ పత్రికల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి ‘ప్రెస్ సేవ’ పోర్టల్‌ను ఒకే వేదికగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం పారదర్శకతను పెంచడం, ఆమోద ప్రక్రియను వేగవంతం చేయడం, ప్రచురణకర్తలకు వ్యాపార సౌలభ్యం కల్పించడం, వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యమని ఆయన వివరించారు. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, హైదరాబాద్‌లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రచురణకర్తలతో మాట్లాడారు.PIB హైదరాబాద్ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రుతి పటిల్ మాట్లాడుతూ, తెలంగాణలో ఇదే మొదటి రకమైన ఇంటరాక్టివ్ సెషన్ అని, ఇది ప్రచురణకర్తల సందేహాలను నివృత్తి చేయడం, కొత్త పీరియాడికల్స్ రిజిస్ట్రేషన్ చట్టం (PRP చట్టం) పై అవగాహన కల్పించడం కోసం నిర్వహించబడిందని తెలిపారు. అలాగే, త్వరలో PIB హైదరాబాద్, PRGI సహకారంతో ప్రచురణకర్తలకు ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.ఉప ప్రెస్ రిజిస్ట్రార్ అశుతోష్ మొహ్లే మాట్లాడుతూ, గత సంవత్సరం మార్చి నుండి మొత్తం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్‌లోకి మారిందని వివరించారు. 60 రోజుల్లోగా స్పందన లభించనట్లయితే, దరఖాస్తులు ఆటోమేటిక్‌గా ఆమోదించబడినట్లే భావించబడతాయని చెప్పారు. అలాగే, ప్రచురణకర్తలు ఏజెంట్లను ఆశ్రయించకుండా నేరుగా PRGI పోర్టల్ ద్వారా సేవలు పొందాలని సూచించారు.
ప్రెస్ రిజిస్టర్(PRGI) పోర్టల్ ప్రారంభం
