RTE 12(1)(C) అమలు: 2026–27కు ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లకు దరఖాస్తులు
జన కమలం వార్త | విజయనగరం:
విద్యాహక్కు చట్టం–2009లోని సెక్షన్ 12(1)(C)ను అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026–27 విద్యా సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న IB, CBSE, ICSE, స్టేట్ సిలబస్ అనుసరిస్తున్న అన్ని ప్రైవేటు అన్-ఎయిడెడ్ పాఠశాలల్లో మొదటి తరగతిలో 25 శాతం సీట్లను పేద, బలహీన వర్గాల విద్యార్థులకు కేటాయించింది.
ఈ పథకం ద్వారా 5 సంవత్సరాలు నిండిన పిల్లలకు వారి నివాస ప్రాంతానికి సమీపంలోని ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య అందించనున్నారు. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి 20 నుంచి మార్చి 10, 2026 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
విద్యార్థుల నమోదు ప్రక్రియ ఆధార్ ఆధారంగా జరుగుతుందని, దరఖాస్తులు http://cse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా సమర్పించవచ్చని తెలిపారు. లాటరీ విధానంలో ఎంపికైన విద్యార్థుల వివరాలను సంబంధిత పాఠశాలల్లో ప్రకటించనున్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లల అడ్మిషన్ల కోసం
గ్రామ/వార్డు సచివాలయాలు, మండల విద్యా వనరుల కేంద్రాలు, లేదా సంబంధిత ప్రైవేటు పాఠశాలలను సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.
సహాయం కోసం
ఇతర వివరాల కోసం సంబంధిత మండల విద్యాశాఖ కార్యాలయం లేదా విజయనగరం జిల్లా విద్యాశాఖాధికారిని సంప్రదించవచ్చని తెలిపారు.
టోల్ ఫ్రీ నంబర్: 1800 425 8599కు కాల్ చేసి సమాచారం పొందవచ్చని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో సమస్యల నివృత్తి కోసం సమగ్ర శిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ (APC)లను సంప్రదించాలని సూచించారు.
అవసరమైన పత్రాలు
తల్లిదండ్రుల ఆధార్ / ఓటరు కార్డు / రేషన్ కార్డు / భూమి హక్కుల పత్రం
MGNREGS జాబ్ కార్డు / పాస్‌పోర్ట్ / డ్రైవింగ్ లైసెన్స్
విద్యుత్ బిల్లు / రెంటల్ అగ్రిమెంట్
పిల్లల వయస్సు ధృవీకరణ పత్రం
వయస్సు అర్హత
IB / CBSE / ICSE పాఠశాలలు: 02-04-2020 నుంచి 31-03-2021 మధ్య జననం
స్టేట్ సిలబస్ పాఠశాలలు: 02-06-2020 నుంచి 31-05-2021 మధ్య జననం
(5 సంవత్సరాల వయస్సు నిండాలి)
అడ్మిషన్ల షెడ్యూల్
నోటిఫికేషన్ విడుదల : 06-02-2026
పాఠశాలల నమోదు/నవీకరణ : 07-02-2026 – 16-02-2026
విద్యార్థుల నమోదు : 20-02-2026 – 10-03-2026
అర్హత నిర్ధారణ : 17-03-2026
మొదటి విడత లాటరీ ఫలితాలు : 25-03-2026
ప్రవేశాల ధృవీకరణ : 26-03-2026 – 07-04-2026
రెండో విడత లాటరీ ఫలితాలు : 12-04-2026
ప్రవేశాల ధృవీకరణ : 13-04-2026 – 23-04-2026
