విశాఖపట్నం, జనవరి 20:
ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవం, ప్రకృతి సౌందర్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో ‘విశాఖ ఉత్సవ్–2026’ను జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. విశాఖతో పాటు అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోనూ ఏకకాలంలో ఉత్సవాలు జరగనున్నాయి.
విశాఖ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష అనంతరం వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఏరినాలో జరిగిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, డోలా బాలవీరాంజనేయ స్వామి, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. మూడు జిల్లాల్లోని 20 వేదికల్లో 500కు పైగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
‘సీ టూ స్కై’ (సాగరం నుంచి శిఖరం వరకు) థీమ్‌తో జరిగే ఈ ఉత్సవాల ద్వారా సుమారు రూ.500 కోట్ల ఆర్థిక చలామణి, 3 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని మంత్రి దుర్గేష్ తెలిపారు. విశాఖలో ప్రారంభమై అనకాపల్లిలో ముగింపు వేడుకలు జరగనున్న ఈ ఉత్సవాలను ప్రజలందరూ కుటుంబ సమేతంగా హాజరై విజయవంతం చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు.

How are you?