సుస్థిర గిరిజనాభివృద్ధి కోసం ఐఐఆర్ఆర్–సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం…
హైదరాబాద్‌లోని ఐసిఏఆర్–ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ (IIRR) మరియు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (CTUAP) మధ్య గిరిజనాభివృద్ధి కోసం అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది.సమావేశం వివరాలు..
ఈ సమావేశానికి ఐఐఆర్ఆర్ డైరెక్టర్ డా. ఆర్. ఎం. సుందరం అధ్యక్షత వహించారు. ప్రముఖ శాస్త్రవేత్తలు డా. సి. ఎన్. నిరజ, డా. అమ్‌తుల్ వారిస్, డా. ఎ. పి. పద్మకుమారి, డా. బి. శ్రీదేవి, డా. పాపారావు వైకుంఠపు పాల్గొన్నారు. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ తరఫున ఆఫీసియేటింగ్ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ టి. శ్రీనివాసన్, అసోసియేట్ ప్రొఫెసర్ డా. అనిరుధ్ కుమార్ హాజరయ్యారు.
చర్చించిన ముఖ్యాంశాలు..గిరిజన ప్రాంతాల్లో సేంద్రియ వరి సాగు ప్రోత్సాహంఇనుము, జింక్ అధికంగా ఉన్న వరి రకాల ద్వారా రక్తహీనత నివారణతక్కువ GI రైస్ రకాలతో డయాబెటిస్ నియంత్రణ
గిరిజన రైతులకు ఆధునిక వరి సాగు సాంకేతికతలపై శిక్షణ…బయోఫోర్టిఫైడ్ వరి విత్తనాల పంపిణీ మరియు సాగులో ప్రోత్సాహంమట్టి పరీక్షలు, పురుగుమందు ఉచ్చులు, వ్యాధుల నియంత్రణపై శిక్షణAICRIP ప్రాజెక్టులో CTUAPకు వాలంటరీ సెంటర్ గుర్తింపుట్రైబల్ సబ్ ప్లాన్ (TSP) ద్వారా గిరిజనుల ఆర్థిక–సామాజిక అభివృద్ధిఅవగాహన ఒప్పందం వివరాలు..ఈ ఒప్పందంపై CTUAP వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ టి. శ్రీనివాసన్, ఐఐఆర్ఆర్ డైరెక్టర్ డా. ఆర్. ఎం. సుందరం సంతకాలు చేశారు
.ఈ భాగస్వామ్యం ద్వారా గిరిజన సమాజానికి స్థిరమైన వ్యవసాయాభివృద్ధి, పోషక భద్రత, ఆర్థిక–సామాజిక పురోగతి సాధించడమే ప్రధాన లక్ష్యమని ఇరు సంస్థలు ప్రకటించాయి.
