జీ20 సమ్మిట్‌లో “ప్రధాని మోదీ” ఆరు అంతర్జాతీయ అభివృద్ధి ప్రతిపాదనలు..

దక్షిణ ఆఫ్రికాలో జరిగిన చారిత్రాత్మక జీ20 సమ్మిట్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆరు కీలక అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిపాదించారు.

పర్యావరణపరమైన సంప్రదాయ జీవన విధానాలను పరిరక్షించేందుకు గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపోజిటరీ ఏర్పాటు, అఫ్రికాలో విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు వచ్చే పదేళ్లలో లక్ష ట్రైనర్లను సిద్ధం చేయాలనే ఆఫ్రికా స్కిల్స్ మల్టీప్లయర్ కార్యక్రమం ప్రతిపాదించారు.

ప్రపంచ ఆరోగ్య ముంపు పరిస్థితులు, సహజ విపత్తుల సమయంలో సత్వరం సహాయం అందించేందుకు జీ20 దేశాల వైద్య నిపుణులతో కూడిన గ్లోబల్ హెల్త్‌కేర్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు గురించి మోదీ సూచించారు.

ప్రమాదకర మత్తు పదార్థాల అక్రమ రవాణాని అరికట్టేందుకు, డ్రగ్ టెర్రర్ ఎకానమీని బలహీనపరిచేందుకు సభ్యదేశాల మధ్య సమన్వయ చర్యలు, ఫైనాన్షియల్ గవర్నెన్స్ మెకానిజంలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

అభివృద్ధి చెందుతున్న దేశాలకు వ్యవసాయం, మత్స్య, విపత్తు నిర్వహణ కోసం ఉపగ్రహ డాటా సాంకేతికతను అందించేందుకు జీ20 ఓపెన్ సాటిలైట్ డేటా పార్ట్‌నర్‌షిప్‌పై భారత్ ప్రతిపాదనను చేసింది.

అలాగే, క్రిటికల్ మినరల్స్ సర్క్యులారిటీ ఇనిశియేటివ్‌ ద్వారా ఖనిజ వనరుల పునఃప్రమాణీకరణ, సరఫరా గొలుసు సమస్యలకు పరిష్కార మార్గాలు సూచించారు