విజయనగరం, సెప్టెంబర్ 11: ప్యాక్ చేయబడిన కొబ్బరి నీళ్లు పై వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో, ఆహార నియంత్రణ అధికారిణి శ్రీమతి S. ఈశ్వరి గారి ఆదేశాల మేరకు ఆహార భద్రత అధికారి నాగుల్ మీరా గురువారం నగరంలోని ఒక ఔషధ దుకాణంలో తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆహార నియంత్రణ అధికారిణి మాట్లాడుతూ, దుకాణంలో విక్రయిస్తున్న ప్యాక్ చేయబడిన కొబ్బరి నీళ్లను పరిశీలించామని, గుర్తించిన తప్పిదాలపై నిర్వాహకులకు తగిన ఆదేశాలు జారీ చేసామని, భవిష్యత్తులో ఇలాంటి లోపాలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు.
అయితే సరిపడా సాంపిల్స్ ఆ దుకాణంలో అందుబాటులో లేనందున మిగిలిన దుకాణాలలో కూడా పరిశీలించి ఆ బ్యాచ్ మొత్తం ప్యాకెట్లను అమ్మకుండా నియంత్రణ చర్యలు చెపడతామని, ఇంకా అదేవిధంగా జరిగితే కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేయబొమని హెచ్చరించారు.
