Posted in

డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్ పాణి చేతుల మీదుగా యువతకు ఉద్యోగ ఆఫర్లు

DRDA PD Srinivas Pani SEEDAP DDUGKY Training Vizianagaram
DRDA PD Srinivas Pani SEEDAP DDUGKY Training Vizianagaram

విజయనగరం:
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా SEEDAP ఆధ్వర్యంలోని DDUGKY ట్రైనింగ్ సెంటర్, TTDCలో శిక్షణ పూర్తిచేసిన యువతకు కోర్సు పూర్తి సర్టిఫికెట్లు మరియు ఉద్యోగ ఆఫర్ లెటర్లను డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ శ్రీనివాస్ పాణి పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో వివిధ ఉద్యోగోపయోగి కోర్సుల్లో శిక్షణ పొందిన అభ్యర్థులు పేరొందిన ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందడం విశేషం. ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ వేతనం రూ.15,000 నుంచి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ఇది గ్రామీణ యువతకు స్థిరమైన జీవనాధారం కల్పించే దిశగా కీలక అడుగుగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ పాణి మాట్లాడుతూ, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన నైపుణ్య శిక్షణ అందించడమే SEEDAP–DDUGKY కార్యక్రమ లక్ష్యమన్నారు. శిక్షణతో పాటు ప్లేస్‌మెంట్ అనుసంధానం కల్పించడం ద్వారా యువతను స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
శిక్షణ పూర్తిచేసి ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు తమకు ఈ అవకాశాన్ని కల్పించిన SEEDAP, DRDA మరియు ట్రైనింగ్ సెంటర్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణ అందించడం వల్ల మంచి ప్లేస్‌మెంట్ ఫలితాలు సాధ్యమయ్యాయని శిక్షణా భాగస్వాములు వివరించారు.
డీఆర్‌డీఏ విజయనగరం ఆధ్వర్యంలో SEEDAP–DDUGKY ట్రైనింగ్ సెంటర్, TTDC ద్వారా భవిష్యత్తులో మరింత మంది నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాబ్స్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీమతి కళ్యాణి, జిల్లా సమాఖ్య అధ్యక్షులు, కోఆర్డినేటర్లు, TTDC మేనేజర్‌తో పాటు SEEDAP సిబ్బంది పాల్గొన్నారు.
ఇదే సందర్భంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ, SEEDAP–DDUGKY ట్రైనింగ్ సెంటర్, TTDCలో త్వరలో కొత్త బ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయని తెలిపారు. మొత్తం 70 సీట్లు అందుబాటులో ఉండగా, ప్రస్తుతం 35 సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అర్హత కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ శిక్షణ మహిళలకు మాత్రమే నిర్వహించబడుతుందని, 18 నుంచి 28 సంవత్సరాల వయస్సు కలిగి, కనీస విద్యార్హతగా ఎస్సెస్సీ ఉత్తీర్ణత ఉండాలని తెలిపారు. శిక్షణ కాలం 90 రోజులు ఉంటుందని వెల్లడించారు.
శిక్షణకు హాజరయ్యే అభ్యర్థులు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు మరియు బయోడేటాతో హాజరుకావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలకు 7989910349, 8885233682 నంబర్లను లేదా డీఆర్‌డీఏ కార్యాలయంలోని SEEDAP (జాబ్స్) విభాగాన్ని సంప్రదించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *