Posted in

Vizianagaram:గ్యాస్ డెలివరీ సమయంలో అదనంగా వసూలు చేస్తే చర్యలు తప్పవు.. జిల్లా జాయింట్ కలెక్టర్

Joint collector vijayanagaram
Joint collector vijayanagaram

విజయనగరం జిల్లాలోని జిల్లా పౌర సరఫరాల అధికారి, లీడ్ బ్యాంకు మేనేజర్, HPCL, IOCL మరియు BPCL గ్యాస్ ఏజెన్సీ డీలర్లు, పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్ విజయనగరం మొదలగు వారితో జాయింట్ కలెక్టర్ వారి ఛాంబర్ నందు శుక్రవారం సాయంత్రం 05.00 గం. లకు రాష్ట్ర ప్రభుత్వం వారి ప్రతిష్టాత్మక పథకాలలో ఒకటైన దీపం 2 పథకం లోని విషయములపై సమావేశం నిర్వహించినారు.

ఈ సమావేశములో జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, దీపం 2 పథకం క్రింద సబ్సిడీ నగదు failure కేసులు గల కారణాలు అయిన ఆధార్ నెంబర్ Active లో లేకపోవడం, బ్యాంకు ఖాతా నంబర్‌కు ఆధార్ నెంబర్ మ్యాప్ చేయబడకపోవడం మరియు  ఖాతా బ్లాక్ చేయబడుట  లేదా స్తంభింపజేయబడుట వలన వినియోగదారులకు సబ్సిడీ నగదు వారి ఖాతాలలో జమ కావడం లేదని, ఈ సమస్యలపై ప్రతి గ్యాస్ ఏజెన్సీ డీలర్ వారి పరిధిలో గల వినియోగదారులకు దీపం 2 పథకం క్రింద సబ్సిడీ నగదు జమకానిచో, వారికి సదరు నగదు వారి బ్యాంకు ఖాతాలో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

జిల్లాలోని గ్యాస్ డెలివరీ సమయంలో డెలివరీ బాయ్స్ వినియోగదారుల నుండి గ్యాస్ ధర కన్న అదనపు నగదు తీసుకోరాదని ఆ విధంగా తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోబడునని తెలియజేసారు. అదే విధంగా డెలివరీ బాయ్స్ వినియోగదారులతో సరైన ప్రవర్తన కలిగి ఉండాలని తెలియజేసారు.

దీపం 2 పధకం క్రింద జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీల పైన ఎటువంటి పిర్యాధులు వఛ్చిన యెడల వారిపై చర్యలు తీసుకోబడునని గ్యాస్ ఏజెన్సీ వారిని హెచ్ఛరించినారు.

గ్యాస్ ఏజెన్సీ డీలర్లు వారి పరిధిలో గల అర్హులైన వినియోగదారులకు వారి బ్యాంకు ఖాతాలలో దీపం పధకం క్రింద సబ్సిడీ నగదు జమ అయ్యే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ కు తెలియజేశారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *