Posted in

మహిళల భద్రతకు మరో కీలక అడుగు – విశాఖలో సఖి వాహనాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్

District collector Vishakapatnam
District collector Vishakapatnam

విశాఖపట్నం:
మహిళల భద్రత, సాధికారతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ స్టాప్ సెంటర్ (OSC) సేవలలో భాగంగా ఏర్పాటు చేసిన సఖి వాహనాన్ని జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ సోమవారం జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళలు ఎలాంటి భయాందోళనలకు లోనుకాకుండా స్వేచ్ఛగా ప్రయాణించేందుకు, అలాగే అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందించేందుకు సఖి వాహనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. సమస్య ఎదురైన వెంటనే స్పందించేలా ఈ వాహనం పనిచేస్తుందని పేర్కొన్నారు.
విశాఖపట్నం జిల్లాలో మహిళలు, బాలికల రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, మహిళలపై జరిగే హింస, వేధింపుల వంటి ఘటనలపై వేగంగా స్పందించేందుకు ఈ సఖి వాహనం కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.వి. రామలక్ష్మి, మిషన్ కోఆర్డినేటర్ సంతోషి, డీసీపీవో హరికృష్ణ, OSC అడ్మినిస్ట్రేటర్ శరణ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *