రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఇ. శాఖామత్యులు కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం, జనవరి, 5: సొమవారం కలక్టరేటు ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)కు, రెవెన్యు క్లినిక్ కార్యక్రమంలకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఇ. శాఖామత్యులు కొండపల్లి శ్రీనివాస్ స్వయంగా పాల్గోని, ప్రజల నుండి వచ్చిన వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పి.జి.ఆర్.ఎస్., రెవెన్యు క్లినిక్ లకు విశేష స్పందన లభిస్తుందని, ప్రజల నుండి వచ్చిన వినతులను, రెవెన్యూ సమస్యలపై వినతులకు సకాలంలో పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆయన ఆదేశించారు. జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలక్టరు, జాయింట్ కలక్టరు ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను స్వీకరించి వారి సమస్యలను సాదవధానంగా విని, సంబంధింత శాఖాల అధికారులకు వెను వెంటనే ఆదేశాలు జారీ చేసారు. పిజిఆర్ఎస్, రెవెన్యు క్లినిక్ కార్యక్రమంనకు ప్రజల నుండి 297 వినతులు స్వీకరించారు. జిల్లా కలక్టరు ఎస్.రాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కు ప్రజల నుండి వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కారించాలని సంబంధిత శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజల యొక్క వినతులు పరిష్కారంలో అధికారులు ఆలసత్యం వహిస్తే సహించేది లేదన్నారు. ప్రతి వారం పిజిఆర్ఎస్ పై సమీక్షించడం జరుగుతుందన్నారు. రెవెన్యు శాఖకు సంబంధించి 149 వినతులు, డిఆర్ డిఎ-64, పంచాయితీ శాఖ-22, , మున్సిపల్ పరిపాలన-2, విద్యుత్ శాఖ-4, గృహ నిర్మాణ శాఖ-2, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ-8, డి.సి.హెచ్.ఎస్.-1, విద్యా శాఖ-3, , ఇతర శాఖ – 42 వినతులు స్వీకరించారు. జిల్లా కలక్టరు మాట్లాడుతూ సంబంధిత శాఖల అధికారులు అర్జీదారును కలిసి, మాట్లాడిన తర్వాతనే ఎండార్స్మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. అర్జీదారునితో మాట్లాడిన తేదీ, సమయం కూడా వారి రిపోర్ట్ లో నమోదు చేయాలన్నారు. పిజిఆర్ఎస్ టోల్ ఫ్రీ నెంబర్ 1100 పై ప్రజలకు అవగాహన కలిగించాలని తెలిపారు. ఈ నెంబర్ కు అందిన కాల్స్ కు కూడా సంబంధిత అధికారి సమాధానం సరైన రీతిలో అందజేయవలసి ఉంటుందన్నారు. ఆర్జిదారుల సమస్యల పరిష్కారంపై సంబంధింత అధికారులను తగు చర్యలు, సత్వర పరిష్కారానిని తగు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీచేసారు.
ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక మరియు రెవెన్యు క్లినిక్ కార్యక్రమంలో జాయింట్ కలక్టరు సేతు మాధవన్, జిల్లా రెవెన్యూ అదికారి మురళి, స్పెషల్ డిప్యూటి కలెక్టర్లు డి.వెంకటేశ్వర రావు, రాజేశ్వరి, ప్రమీల గాంధీ, బి. శాంతి, కళావతి, సర్వే శాఖ ఎ.డి. ఆర్.విజయకుమార్, కలక్టరేటు పరిపాలనాధికారి దేవి ప్రసాద్, సి.పి.ఒ. బాలజి, జిల్లా పరిషత్ సిఇఒ బి.వి.సత్యనారాయణ, జిల్లా విద్యాశాఖాధికారి మణిక్యంయుడు, వ్యవసాయ శాఖ జెడి, సాంఘిక సంక్షేమ శాఖ డిడి అన్నపూర్ణమ్మ, బి.సి.సంక్షేమ అధికారి జ్యోతిశ్రీ, పంచాయితీరాజ్ ఎస్.ఇ. ఆర్.డబ్ల్యుఎస్ మరియు ఆర్ అండ్ బి ఎస్.ఇ.లు మార్కఫెడ్ మేనేజరు వెంకటేశ్వరరావు, విజయనగరం, ఐ.సిడి.ఎస్. పి.డి. విమలరాణి, డిఆర్ డి ఎ పిడి శ్రీనివాస్ పాణి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి జీవనరాణి, జిల్లా సమాచార పౌరసంబంధాల అదికారి పి.గోవిందరాజులు, మైక్రోఇరిగేషన్ పి.డి. లక్ష్మీనారాయణ, జిల్లా అధికారులు, విజయనగరం, చీపురుపల్లి, బొబ్బిలి ఆర్.డి.ఓలు, జిల్లాలో అన్ని మండలాల తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు
