విజయనగరం, డిశంబరు, 29: సొమవారం కలక్టరేటు ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)కు, రెవెన్యు క్లినిక్ కార్యక్రమంలకు విశేష స్పందన లభించింది. పిర్యాదుదారుల నుండి మొత్తం 232 వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలక్టరు ఎస్.రాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కు ప్రజల నుండి వచ్చిన వినతులను వారంతంలోగా పరిష్కారించాలని సంబంధిత శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) మరియు రెవెన్యు క్లినిక్ కార్యక్రమం వినతుల స్వీకరణ కార్యక్రమంలో జిల్లా కలక్టరు, జిల్లా రెవెన్యూ అధికారి, స్పెషల్ డిప్యూటి కలక్టర్లు తదితరులు ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను స్వీకరించి వారి సమస్యలను సాదవధానంగా విని, సంబంధింత శాఖాల అధికారులకు వెను వెంటనే ఆదేశాలు జారీ చేసారు.
ప్రజల యొక్క వినతులు పరిష్కారంలో అధికారులు ఆలసత్యం వహిస్తే సహించేది లేదన్నారు. రెవెన్యూ శాఖకు వచ్చిన వినతులను సకాలంలో పరిష్కరించాలన్నారు. ప్రతి వారం పిజిఆర్ఎస్ పై సమీక్షించడం జరుగుతుందన్నారు.
ఫిర్యాదుదారుల నుండి మొత్తం 232 వినతులు స్వీకరించి, వినతులపై తగు పరిష్కారం, చర్యలు చేపట్టుటకు సంబంధింత శాఖల జిల్లా అధికారులను జిల్లా కలక్టరు ఆదేశాలు జారీచేసారు. రెవెన్యు శాఖకు సంబంధించి 136 వినతులు, పంచాయితీ శాఖ-26, పోలీస్-10, పబ్లిక్ హెల్త్-10, మున్సిపల్ పరిపాలన-9, సర్వే ల్యాండ్ రికార్డ్స్ఞ్ -5, వ్యవసాయ శాఖ-4, విద్యుత్ శాఖ-4, డైరక్టరీ ఆఫ్ సెకండరీ హెల్త్-3, ఎస్.సి.కార్పోరేషన్-2, దేవదాయశాఖ-2, మెడికల్ ఎడ్యుకేషన్-2, పంచాయితీరాజ్ ఇంజనీరింగ్-2, సమగ్రశిక్ష-2, వాటర్ రిసోర్స్-2 వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలక్టరు మాట్లాడుతూ సంబంధిత శాఖల అధికారులు అర్జీదారును కలిసి, మాట్లాడిన తర్వాతనే ఎండార్స్మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. అర్జీదారునితో మాట్లాడిన తేదీ, సమయం కూడా వారి రిపోర్ట్ లో నమోదు చేయాలన్నారు.
పిజిఆర్ఎస్ టోల్ ఫ్రీ నెంబర్ 1100 పై ప్రజలకు అవగాహన కలిగించాలని తెలిపారు. ఈ నెంబర్ కు అందిన కాల్స్ కు కూడా సంబంధిత అధికారి సమాధానం సరైన రీతిలో అందజేయవలసి ఉంటుందన్నారు. ఆర్జిదారుల సమస్యల పరిష్కారంపై సంబంధింత అధికారులను తగు చర్యలు, సత్వర పరిష్కారానిని తగు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీచేసారు.
ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక మరియు రెవెన్యు క్లినిక్ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదికారి మురళి, స్పెషల్ డిప్యూటి కలెక్టర్లు డి.వెంకటేశ్వర రావు, రాజేశ్వరి, ప్రమీల గాంధీ, బి. శాంతి, కళావతి, సర్వే శాఖ ఎ.డి. ఆర్.విజయకుమార్, కలక్టరేటు పరిపాలనాధికారి దేవి ప్రసాద్, సి.పి.ఒ. బాలజి, జిల్లా పరిషత్ సిఇఒ బి.వి.సత్యనారాయణ, జిల్లా విద్యాశాఖాధికారి మణిక్యంయుడు, వ్యవసాయ శాఖ జెడి, సాంఘిక సంక్షేమ శాఖ డిడి అన్నపూర్ణమ్మ, బి.సి.సంక్షేమ అధికారి జ్యోతిశ్రీ, పంచాయితీరాజ్ ఎస్.ఇ. ఆర్.డబ్ల్యుఎస్ మరియు ఆర్ అండ్ బి ఎస్.ఇ.లు మార్కఫెడ్ మేనేజరు వెంకటేశ్వరరావు, విజయనగరం, ఐ.సిడి.ఎస్. పి.డి. విమలరాణి, డిఆర్ డి ఎ పిడి శ్రీనివాస్ పాణి, జిల్లా సమాచార పౌరసంబంధాల అదికారి పి.గోవిందరాజులు, మైక్రోఇరిగేషన్ పి.డి. లక్ష్మీనారాయణ, జిల్లా అధికారులు, విజయనగరం, చీపురుపల్లి, బొబ్బిలి ఆర్.డి.ఓలు, జిల్లాలో అన్ని మండలాల తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
