పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఆయన, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన “రాజాసాబ్” చిత్రం సెప్టెంబర్ 5న విడుదల కానుంది. హారర్ కామెడీ జానర్లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ పోషించనున్నాడు. నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్ ఇందులో కీలక పాత్రలు చేస్తున్నారు.
నిర్మాత మాటల్లో ప్రభాస్ ఔదార్యం
ప్రభాస్ నటించిన “రాధేశ్యామ్” సినిమా భారీ అంచనాలతో విడుదలై, ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఈ చిత్రానికి ప్రభాస్ రూ.100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడని, కానీ సినిమా ఫ్లాప్ కావడంతో ఆలోచన లేకుండా రూ.50 కోట్లు తిరిగి ఇచ్చేశాడు అని ఓ తమిళ నిర్మాత వెల్లడించారు.
అయితే ఈ డబ్బును డిస్టిబ్యూటర్స్ నష్టాలను తీరుస్తూ ఇవ్వమని ప్రభాస్ కోరాడని కూడా సమాచారం. ఇంత పెద్ద మొత్తాన్ని వెనక్కి ఇచ్చిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అభిమానుల రియాక్షన్
ఈ వార్త తెలిసిన వెంటనే ప్రభాస్ అభిమానులు ఆనందంతో ముంచెత్తుతున్నారు.
👉 “మనసున్న మా రాజు, మనసు బంగారం మా డార్లింగ్ది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
👉 సోషల్ మీడియాలో #Prabhas ట్రెండింగ్ అవుతోంది.
ప్రభాస్ లైన్ అప్
“రాజాసాబ్” తర్వాత కూడా ప్రభాస్ వరుసగా పలు పెద్ద సినిమాలు చేస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న “ఫౌజీ” (వర్కింగ్ టైటిల్) ఆయన అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది.
హైలైట్స్
రాధేశ్యామ్ కోసం ప్రభాస్ రూ.100 కోట్లు తీసుకున్నాడు.
సినిమా ఫ్లాప్ కావడంతో రూ.50 కోట్లు వెనక్కి ఇచ్చాడు.
నిర్మాత, డిస్టిబ్యూటర్స్ నష్టాలు భర్తీ చేయాలని కోరాడు.
ఫ్యాన్స్: “మనసున్న మా రాజు ప్రభాస్!” అని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
