Posted in

ఆక్రమణలు తొలగించిన దేవాదాయ శాఖ అధికారులు

Endowment department Vizianagaram
Endowment department Vizianagaram

శ్రీ పైడితల్లి అమ్మవారి గ్రూపు దేవాలయాలములలో ఒకటైన జామి మండలం మరియు భీమసింగి గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానమునకు చెందినదేవస్థాన భూములను ఆక్రమించి స్వాధీనం చేసుకున్న భూములు (సర్వే నంబర్ 151/3) పై ఆక్రమాదారులు వేసిన నిర్మాణాలు 12-08-2025న తొలగించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.

అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియకు దేవదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, రెవిన్యూ, సర్వే డిపార్ట్మెంట్ మరియు పోలీస్ శాఖలు కలిసి సమన్వయంతో పనిచేశారు.

అదేవిధంగా, జామి మండలంలోని భీమసింగి గ్రామంలో సర్వే నంబర్లు 157, 158, 159, 160, 169, 174, 179, 182, 32, 189, 18, 21, 188, 167, 184, 166, 206లో ఉన్న సబ్ డివిజన్ల వారీగా ఎకరా 55. 78 సెంట్లు భూమి దేవస్థానం భూములని ఇందులో ఎవరైన అక్రమ నిర్మాణాలు చేపడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి శ్రీమతి కె. శిరీష, సూపరింటెండెంట్ శ్రీమతి వైవి రమణి, దేవాదాయ శాఖ ఎస్.కోట ఇన్ స్పెక్టర్ ఎమ్.ప్రసాద్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *